వృషభ రాశి 2023 సంవత్సర రాశి ఫలములు

వృషభ రాశి రాశిఫలములు

2023 సంవత్సర రాశి ఫలములు

Telugu Rashi Phalalu (Rasi phalamulu)

2023 Rashi phalaalu (rasi phalamulu)



గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలాలు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2023 samvatsara Vrishabha rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Vrishabha Rashi in Telugu

vrishabha rashi telugu predictions vijaya telugu year

 కృత్తిక నక్షత్రం 2,3,4 పాదములు (ఈ,ఊ,ఏ) రోహిణి నక్షత్రం 1,2,3,4 పాదములు,(ఓ,వా,వీ,వూ) , మృగశిర నక్షత్రం 1,2 పాదములలో (వే,వో) జన్మించిన వారు వృషభ రాశి జాతకులు

ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఏప్రిల్ 22 వరకు గురువు మీ రాశికి పదకొండవ స్థానమైన మీన రాశిలో ఉంటాడు. ఆ తర్వాత పన్నెండవ స్థానమైన మేష రాశి లోకి ప్రవేశించి, సంవత్సరమంతా ఇదే స్థానములో సంచరిస్తాడు. శని జనవరి 17న, మీ రాశికి తొమ్మిదవ స్థానమైన మకర రాశి నుంచి, మీ రాశికి పదవ స్థానమైన కుంభ రాశి లోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 30 న రాహువు మీ రాశికి పన్నెండవ స్థానమైన మేష రాశి నుంచి, పదకొండవ స్థానమైన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు మరియు కేతువు మీ రాశికి ఆరవ స్థానమైన తులా రాశి నుంచి ఐదో స్థానమైన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు.

2023వ సంవత్సరం ఉద్యోగస్థులకు ఎలా ఉండబోతోంది?

ఈ సంవత్సరం వృషభరాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురువు గోచారం మరియు శని గోచారం అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీరు అనుకున్న విధంగా పనులు పూర్తి అవడం వలన వ్యక్తిగతంగా మరియు ఉద్యోగ పరంగా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా పదకొండవ ఇంటిలో గురువు గోచారం ఉండటం వలన వృత్తిలో అభివృద్ధి అనుకున్న విధంగా సాధ్యం అవుతుంది. మీరు చేపట్టిన పనులు విజయవంతం అవడం వలన సహోద్యోగుల మెప్పును మరియు పై అధికారుల మెప్పును పొందుతారు. ఈ సంవత్సరం ప్రథమార్ధంలో మీరు అనుకున్న విధంగా పదోన్నతి పొందుతారు. అంతేకాకుండా మీరు పనిచేసే దగ్గర మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ కారణంగా మీ సంస్థకు కూడా మంచి పేరు లభించడమే కాకుండా మీరు పనిచేసే సంస్థ అభివృద్ధిలో మీరు ప్రధాన భాగస్వామి అవుతారు. ఏప్రిల్ మూడవ వారంలో గురువు గోచారం పన్నెండవ ఇంటికి మారటం వలన మీ వృత్తిలో అనుకోని మార్పులు చోటుచేసుకుంటాయి. మీకు వచ్చిన విజయాలు మీలో అహంకారాన్ని, ఎవరినీ లెక్క చేయని స్వభావాన్ని పెంచే అవకాశం ఉంటుంది. దాని కారణంగా అంతవరకూ మీతో సన్నిహితంగా మెలిగిన మీ సహోద్యోగులు కానీ మీ పై అధికారులు కానీ మీపై కోపాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. మీ ప్రవర్తనలో కలిగిన మార్పు వారికి అర్థం కాకపోవటం వలన, వారు మీ గురించి పై అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. పన్నెండవ ఇంటిలో ఉన్న రాహువు పై శని దృష్టి కారణంగా మీలో బద్ధకం మరియు అసహనం ఎక్కువవుతాయి. వీటి కారణంగా గతంలో తక్కువ సమయంలో పూర్తి చేసిన పనులు మీరు ఇప్పుడు ఎక్కువ సమయం తీసుకొని పూర్తి చేయటం లేదా వాయిదా వేయటం చేస్తుంటారు. దీని కారణంగా మీకు వచ్చే మంచి అవకాశాలు కూడా దూరం అవుతాయి. పదవ ఇంటిలో శని గోచారం అనుకూలంగా ఉండటం వలన మీరు కొన్నిసార్లు మీకు ఇచ్చిన పనులను పూర్తి చేయక పోయినప్పటికీ మీకు మరిన్ని అవకాశాలు వస్తాయి. అయితే నవంబర్ వరకు గురువు మరియు రాహువు గోచారం పన్నెండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. మీరు తొందరపడి మీ ఉద్యోగం విషయంలో తీసుకునే నిర్ణయాలు మీకు ఇబ్బంది కలిగించడమే కాకుండా మీరు ఉంటున్న ప్రదేశాన్ని వదిలి స్వదేశానికి రావడం కానీ, లేదా నచ్చని ఉద్యోగం తప్పనిసరిగా చేయాల్సి రావడం కాని జరుగుతుంది. సంవత్సరమంతా ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో ఉద్యోగ విషయంలో మీరు ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకండి. ఒకవేళ మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం మారాలి అనుకుంటే, చేస్తున్న ఉద్యోగం మానకుండా వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేయటం మంచిది. అంతేకాకుండా ఈ సమయంలో మీరు మీ పేరు ప్రతిష్టల కొరకు కాకుండా నిజాయితీగా మీలో ఉన్న నైపుణ్యాన్ని చూపించి పని చేయటం వలన మీ ఉద్యోగంలో ఏర్పడే ఒడిదుడుకులను తట్టుకోగలుగుతారు. నిజాయితీకి, పనికి కారకుడైన శని గోచారం పదవ ఇంటిలో ఉండటం వలన మీరు మీ వృత్తిలో ఎంత నిజాయితీగా ఉంటే మీరు అంత అభివృద్ధిని పొందుతారు. పన్నెండవ ఇంటిలో గురువు మరియు రాహువుల గోచారం కొన్నిసార్లు మీరు అప్పుడు ఆలోచనలు చేసే విధంగా, అలాగే మీరు తప్పనిసరిగా చేయాల్సిన పనిని తప్పించుకోవడానికి రకరకాల ఎత్తులు వేసేలా చేస్తుంది. అలా చేయటం ఈ సమయంలో మంచిది కాదు అది మీకు భవిష్యత్తులో వృత్తి పరమైన సమస్యలను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం జనవరి 14 నుంచి ఫిబ్రవరి 13 మధ్యలో, ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో, ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో మరియు డిసెంబర్ చివరి రెండు వారాల్లో మీ ఉద్యోగ విషయంలో ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకండి. అంతేకాకుండా ఈ సమయం మీకు వృత్తిపరంగా ఒత్తిడిని, పని భారాన్ని ఎక్కువగా ఇస్తుంది. ఈ సమయాల్లో మీకు కేటాయించిన పని వాయిదా వేయకుండా పూర్తి చేసే ప్రయత్నం చేయండి. మీకు కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ శని గోచారం అనుకూలంగా ఉండటం వలన కొద్ది శ్రమతో పనులను పూర్తి చేయగలుగుతారు.

2023వ సంవత్సరం వ్యాపారస్థులకు మరియు స్వయం ఉపాధి కలవారికి ఎలా ఉండబోతోంది?

2023 వ సంవత్సరం వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సంవత్సరమంతా శని దృష్టి 12వ ఇంటిపై, నాలుగవ ఇంటిపై మరియు ఏడవ ఇంటిపై ఉండటం వలన వ్యాపారస్తులు తమ వ్యాపారంలో ఒడిదుడుకులను ఎదుర్కుంటారు. ఏప్రిల్ వరకు గురు గోచారం పదకొండవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన మీరు చేసే వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. ఈ సమయంలో కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునేవారికి అనుకూలంగా ఉంటుంది. గురు దృష్టి ఏడవ ఇంటిపై ఉండటంవలన వ్యాపారంతో పాటు ఆర్థికంగా కూడా జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో మీకు లాభదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం భాగస్వామ్య వ్యాపారానికి అంతగా అనుకూలించదు. ఏప్రిల్ వరకు గురు గోచారం బాగున్నప్పటికీ ఏడవ ఇంటిపై శని దృష్టి కారణంగా వ్యాపార భాగస్వాములతో మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఏప్రిల్ లోపు డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది. ఏప్రిల్ తర్వాత గురు గోచారం మీకు అనుకూలంగా ఉండదు కాబట్టి పెట్టుబడిగా పెట్టిన డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది.
స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఏప్రిల్ వరకు గురువు గోచారం పదకొండవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన మీ వృత్తిలో మీరు మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. ఈ సమయంలో మీరు విరామం దొరకనంత పనిని కలిగి ఉంటారు. మీ నైపుణ్యం కారణంగా మీరు మంచి పేరు గడిస్తారు అలాగే మరిన్ని అవకాశాలు అందుకుంటారు. ఏప్రిల్ నుంచి గురువు గోచారం 12వ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో మీకు మంచి అవకాశాలు వచ్చినప్పటికీ మీ నిర్లక్ష్యం కారణంగా కానీ, లేదా మీ వాయిదా వేసే స్వభావము వలన కానీ మీకు వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేక పోతారు. దానివలన గతంలో మీకు వచ్చిన మంచి పేరు చెడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయవచ్చు. శని గోచారం పదవ ఇంటిలో ఉండటం వలన మీకు కొత్త అవకాశాలు రావటం జరిగినప్పటికీ మీరు వాటిని వినియోగించుకోవడంలో మీ శక్తిని సరిగా ఉపయోగించుకోలేదు. అంతేకాకుండా ఇతరుల ప్రలోభాలకు లొంగి కూడా మీరు మీకు వచ్చిన అవకాశాలను వదిలి వేయటం జరుగుతుంది. గురువు మరియు రాహువు గోచారం పన్నెండవ ఇంటిలో నవంబర్ వరకు ఉండటం వలన ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. పొగడ్తలకు కానీ, ఇతరుల మాటలకు కానీ లొంగకుండా మీరు వివేకంతో ఆలోచించి లేదా అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని నిర్ణయం తీసుకోవటం మంచిది. దానివలన మీకు వచ్చిన అవకాశాలు సద్వినియోగ పరుచుకోగలుగుతారు.

2023వ సంవత్సరం మీ ఆర్థిక స్థితి ఎలా ఉండబోతోంది?

2023 లో వృషభ రాశి వారి ఆర్థిక స్థితి మిశ్రమంగా ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో గురు గోచారం పదకొండవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన ఆర్థికంగా నిలదొక్కుకో గలుగుతారు. మీ ఆదాయం పెరగడమే కాకుండా మీరు పెట్టుబడి పెట్టిన పెట్టుబడులు కూడా లాభాలను ఇస్తాయి. ఈ సమయంలో మీరు ఇల్లు కాని, వాహనం కాని, ఇతర స్థిరాస్థులు కానీ కొనుగోలు చేస్తారు. గతంలో మీరు బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లు కాని, అప్పులు కానీ తిరిగి తీర్చగలుగుతారు. సంవత్సరమంతా శని దృష్టి 12వ ఇంటిపై ఉండటం వలన ఈ సంవత్సరం మీకు లాభాలతో పాటుగా ఖర్చులు కూడా ఉంటాయి. అయితే ఏప్రిల్ వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండటంతో మీ ఆదాయం పెరగడం వలన, ఆ తర్వాత ఏర్పడే ఖర్చులను భరించగలుగుతారు. పన్నెండవ ఇంటిలో రాహు గోచారం అక్టోబర్ చివరి వరకు ఉంటుంది కాబట్టి ఖర్చుల విషయంలో కానీ, పెట్టుబడుల విషయంలో కానీ ఏప్రిల్ తర్వాత మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి అక్టోబర్ చివరి వరకు గురువు మరియు రాహు గోచారం పన్నెండవ ఇంటిలో ఉండటం వలన శుభకార్యాలకు మరియు అవసరమైన వాటికి మీరు డబ్బు ఖర్చు చేయటమే కాకుండా అనవసరమైన వాటి విషయంలో కూడా ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. తొందరపడి కానీ, ఇతరుల మాటలకు లొంగి పెట్టుబడులు పెట్టడం ఈ సమయంలో మంచిది కాదు. శని దృష్టి అష్టమ స్థానం పై ఉంటుంది కాబట్టి కొత్తగా బ్యాంకు లోన్ లు లేదా అప్పులు తీసుకోవాలనుకునే వారు తప్పనిసరి అయితే తప్ప వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ చివరి వరకూ ఉండే గురువు గోచారం కారణంగా ఇంటి మరమ్మతులకు కానీ వాహన మరమ్మతుల కానీ మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. శని దృష్టి కూడా నాలుగవ ఇంటిపై ఉండటం వలన గృహ సంబంధ వ్యవహారాల్లో, అలాగే భూముల కొనుగోలు విషయంలో మీకు న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. మీరు స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు అన్ని రకాల పత్రాలు సరి చూసుకొని, అనుభవజ్ఞుల సలహా తీసుకొని మాత్రమే కొనటం మంచిది. నవంబర్ నుంచి రాహు గోచారం పదకొండవ ఇంటిలో ఉండటం వలన మీకు మీ మిత్రుల నుంచి కానీ, బంధువుల నుంచి కానీ, తోబుట్టువుల నుంచి కానీ అవసరానికి తగిన ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంటుంది. అలాగే గతంలో చేసిన పెట్టుబడి నుంచి కూడా మీకు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఈ సంవత్సరం జూలై 1 నుంచి ఆగస్టు 18 వరకు కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో భూ సంబంధ లావాదేవీలు చేయకపోవడం మంచిది. అంతేకాకుండా ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్య, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 మధ్య, మరియు డిసెంబర్ 16 నుంచి సంవత్సరాంతం వరకు సూర్యుని గోచారం మీకు అనుకూలంగా ఉండదు కాబట్టి, ఈ సమయంలో కూడా ఆర్థిక సంబంధ పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.

2023వ సంవత్సరం మీ ఆరోగ్యం ఎలా ఉండబోతోంది?

ఆరోగ్య విషయంలో 2023 వ సంవత్సరం వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఏప్రిల్ వరకు గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యం బాగుండటమే కాకుండా గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా వెన్నెముక, జననాంగ సంబంధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ సమయంలో స్వాంతన పొందుతారు. వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంవత్సరమంతా శని దృష్టి 12వ ఇంటిపై, నాలుగవ ఇంటిపై మరియు ఏడవ ఇంటిపై ఉంటుంది దీని కారణంగా ఏప్రిల్ తర్వాత ఊపిరితిత్తులు, మూత్రపిండాలు మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాహు గోచారం కూడా అనుకూలంగా ఉండకపోవటం రాహువు మరియు గురువుపై శని దృష్టి ఉండటం వలన మెడలు, జీర్ణాశయం మరియు మూత్రపిండాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రాహు గోచారం కారణంగా మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. సంవత్సరం వీలైనంత వరకు ప్రాణాయామం కానీ యోగా కాని, ధ్యానం కానీ సాధన చేయటం మంచిది. దాని వలన మీ మానసిక ఒత్తిడి తగ్గటమే కాకుండా శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శని దృష్టి నాలుగవ ఇంటిపై ఉండటం వలన వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది ముఖ్యంగా జూలై మరియు ఆగస్టు మధ్య కాలంలో కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

2023వ సంవత్సరం మీ కుటుంబ జీవితం ఎలా ఉండబోతోంది?

2023 సంవత్సరం వృషభ రాశి వారికి కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఏప్రిల్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులు మీ మాటకు విలువ ఇస్తారు. మీకు అవసరమైన సమయంలో వారు చేసే సహాయం కారణంగా మీరు సమస్యల నుంచి బయట పడగలుగుతారు. గురు దృష్టి వరకు మూడవ ఇంటిపై, ఐదవ ఇంటిపై, మరియు ఏడవ ఇంటిపై ఉండటం వలన మీ తోబుట్టువులతో, మీ పిల్లలతో మరియు మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. వారి సహకారంతో మీరు మీ వృత్తిలో విజయాలు సాధించగలుగుతారు. ప్రథమార్ధంలో గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ పిల్లలు వారి, వారి రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీరు అవివాహితులు అయ్యుండి వివాహం గురించి ఎదురుచూస్తున్న వారైతే ఈ సంవత్సరం ఏప్రిల్ లోపు వివాహం అయ్యే అవకాశం బలంగా ఉంటుంది. అలాగే మీరు సంతానం గురించి ఎదురు చూస్తుంటే ఈ సంవత్సరం మీకు సంతాన యోగాన్ని ఇస్తుంది. అయితే రాహు గోచారం ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు పన్నెండవ ఇంటిలో ఉండటం వలన మీలో అహంకారం కానీ, అతి ఆత్మవిశ్వాసం కాని ఎక్కువ అవుతుంది. దాని కారణంగా మీరు మీ కుటుంబ సభ్యులపై ఆధిపత్యం చలాయించాలని చూస్తారు. మీరు చెప్పిన దానికి వారు అనుకూలంగా నడచుకోకుంటే వారితో గొడవ పెట్టుకుంటారు. మీ ఈ ప్రవర్తన కారణంగా మీ కుటుంబ సభ్యులు కొంత ఇబ్బందికి గురవుతారు. ముఖ్యంగా ఏప్రిల్లో గురువు గోచారం 12వ ఇంటికి మారటంతో మానసికంగా మీరు అశాంతికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కొన్ని ఇబ్బందులు రావటం వలన మీకు ఇష్టం లేకున్నా మీ కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవాల్సి వస్తుంది. శని దృష్టి నాలుగవ ఇంటిపై ఉండటం వలన మీ కుటుంబంలో ప్రశాంతత కరువు అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామితో కూడా అభిప్రాయభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. పట్టు వదలని మీ ప్రవర్తన కారణంగా మీ జీవిత భాగస్వామి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే మీ జీవితభాగస్వామి ఓర్పుగా వ్యవహరించి సమస్యను పెద్దది కాకుండా చూసుకుంటారు. దానివలన మీ జీవిత భాగస్వామితో ఉన్న సమస్య తొందరగానే సమసిపోతాయి. గురు దృష్టి ఆరవ మరియు ఎనిమిదవ ఇంటిపై ఉండటం వలన మీ విజయాలకు ఓర్చుకోని కొందరు మీకు ఆర్థికంగా, సమాజ పరంగా నష్టం చేయాలని చూస్తారు. అయితే మీరు తెలివిగా వ్యవహరించడం వలన దాని నుంచి బయట పడతారు.

2023వ సంవత్సరం విద్యార్థులకు ఎలా ఉండబోతోంది?

విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సంవత్సర ప్రథమార్థం అనుకూలంగా ఉంటే ద్వితీయార్థంలో మాత్రం కొన్ని సమస్యలను ఎదుర్కుంటారు. ఏప్రిల్ వరకు గురు గోచారం లాభ స్థానంలో అనుకూలంగా ఉండటం వలన చదువుపై ఆసక్తి పెరగడమే కాకుండా పరీక్షలతో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఈ సమయంలో గురు పంచమ స్థానాన్ని చూడటం వలన ఉద్యోగార్థులు కాంపిటీటివ్ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులై ఉద్యోగాన్ని పొందగలుగుతారు. సంవత్సరమంతా శని దృష్టి నాలుగవ ఇంటిపై ఉండటం వలన ప్రాథమిక విద్యను అభ్యసించే విద్యార్థులు చదువుపై శ్రద్ధ తగ్గి ఇతర వ్యాపకాలను అలవాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఏప్రిల్ నుంచి గురువు గోచారం పన్నెండవ ఇంటిలో ఉన్నప్పటికీ గురు దృష్టి నాలుగవ ఇంటిపై ఉండటం వలన విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరం వారు ఏకాగ్రతను పెంచుకోవాల్సి ఉంటుంది. పన్నెండవ ఇంటిలో రాహు గోచారం ఉండటం మరియు శని దృష్టి 12వ ఇంటిపై ఉండటం కారణంగా విద్యార్థుల్లో ఏకాగ్రత లోపించి, జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి వారు వీలైనంత వరకు చదువుపై శ్రద్ధ పెట్టడం మంచిది. నవంబర్ నుంచి రాహు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి వారికి చదువుపై ఏకాగ్రత పెరిగి పరీక్షలలో బాగా రాణిస్తారు. ఈ సంవత్సరం విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునేవారికి అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రారంభంలో కొన్ని అడ్డంకులు వచ్చే అవకాశం ఉంటుంది వారు ఒకటికి రెండు సార్లు ప్రయత్నిస్తే అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతారు.

2023వ సంవత్సరం ఏ గ్రహాలకు, ఏయే పరిహారాలు చేయాలి?

వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆధ్యాత్మికంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రథమార్ధంలో ఏప్రిల్ వరకు గురు దృష్టి ఐదవ ఇంటిపై ఉండటం వలన మీరు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు. అంతేకాకుండా ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి గురు గోచారం మరియు నవంబర్ వరకు రాహు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి గురువుకు మరియు రాహువుకు పరిహారాలు ఆచరించడం మంచిది. రాహు గోచారం పన్నెండవ ఇంట్లో ఉండటం వలన మానసిక సమస్యలు మరియు ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం రాహువు పరిహారాలు చేయటం మంచిది. దానికి గాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు సంబంధ స్తోత్రం కానీ రాహు మంత్ర జపం కానీ లేదా రాహు ప్రభావాన్ని తగ్గించే దుర్గా స్తోత్రం కానీ చేయటం మంచిది. దానివలన రాహువు ఇచ్చే చెడు ఫలితం తగ్గుతుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి గురువు గోచారం పన్నెండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఇది ఆర్థికంగా మరియు ఆరోగ్యపరంగా చెడు ఫలితాలను ఇస్తుంది కాబట్టి గురువుకు పరిహారాలు ఆచరించడం మంచిది. ప్రతిరోజు కానీ, ప్రతి గురువారం కానీ గురు స్తోత్రం చదవడం లేదా, గురు మంత్ర జపం చేయటం లేదా, గురుచరిత్ర పారాయణం చేయడం మంచిది. దానివలన గురువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గి ఈ సంవత్సరం మీకు శుభాలను ఇస్తుంది.

రాజాది నవనాయక ఫలితములు

12 రాశుల ఆదాయ, వ్యయాలు

27 నక్షత్రాల నక్షత్రాల కందాయ ఫలములు

శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలములు

Aries
Mesha rashi,year 2026 rashi phal for ... rashi
Taurus
vrishabha rashi, year 2026 rashi phal
Gemini
Mithuna rashi, year 2026 rashi phal
Cancer
Karka rashi, year 2026 rashi phal
Leo
Simha rashi, year 2026 rashi phal
Virgo
Kanya rashi, year 2026 rashi phal
Libra
Tula rashi, year 2026 rashi phal
Scorpio
Vrishchika rashi, year 2026 rashi phal
Sagittarius
Dhanu rashi, year 2026 rashi phal
Capricorn
Makara rashi, year 2026 rashi phal
Aquarius
Kumbha rashi, year 2026 rashi phal
Pisces
Meena rashi, year 2026 rashi phal

 

Telugu Panchangam

 

Today's Telugu panchangam for any place any time with day guide.

 Read More
  
 

KP Horoscope

 

Free KP Janmakundali (Krishnamurthy paddhati Horoscope) with predictions in Telugu.

 Read More
  
 

Kundali Matching

 

Free online Marriage Matching service in Telugu Language.

 Read More
  
 

Newborn Astrology

 

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Telugu.

 Read More
  

Contribute to onlinejyotish.com

QR code image for Contribute to onlinejyotish.com
Contribute via UPI (For Indians)

People living in other countries, contribute via PayPal.

Why Contribute?

  • Support the Mission: Your contributions help us continue providing valuable Jyotish (Vedic Astrology) resources and services to seekers worldwide for free.
  • Maintain & Improve: We rely on contributions to cover website maintenance, development costs, and the creation of new content.
  • Show Appreciation: Your support shows us that you value the work we do and motivates us to keep going.
You can support onlinejyotish.com by sharing this page by clicking the social media share buttons below if you like our website and free astrology services. Thanks.

Random Articles