మీన రాశి -2023 సంవత్సర రాశి ఫలములు

మీన రాశిఫలములు

2023 సంవత్సర రాశిఫలములు

Telugu Rashi Phalalu (Rasi phalamulu)

2023 Rashi phalaalu


గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2023 samvatsara Meena rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Meena Rashi in Telugu

Kanya rashi telugu year predictions

పూర్వాభాద్ర 4వ పాదం (ది)
ఉత్తరాభాద్ర 4 పాదాలు (దు, శం, ఝ, థ)
రేవతి 4 పాదాలు (దే, దో, చ, చి)

ఈ సంవత్సరం మీన రాశి వారికి ఏప్రిల్ 22 వరకు గురువు మీ రాశికి ఒకటవ స్థానమైన మీన రాశిలో ఉంటాడు. ఆ తర్వాత రెండవ స్థానమైన మేష రాశి లోకి ప్రవేశించి, సంవత్సరమంతా ఇదే స్థానములో సంచరిస్తాడు. శని జనవరి 17న, మీ రాశికి పదకొండవ స్థానమైన మకర రాశి నుంచి, పన్నెండవ స్థానమైన కుంభ రాశి లోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 30న రాహువు రెండవ స్థానమైన మేష రాశి నుంచి, ఒకటవ స్థానమైన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు మరియు కేతువు ఎనిమిదవ స్థానమైన తులా రాశి నుంచి ఏడవ స్థానమైన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు.

2023వ సంవత్సరం ఉద్యోగస్థులకు ఎలా ఉండబోతోంది?

ఈ సంవత్సరం మీన రాశిలో జన్మించిన వారికి ప్రథమార్థం మిశ్రమంగా, ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం జనవరిలో ఏలి నాటి శని గోచారం ప్రారంభమవడం, రాహువు మరియు కేతువుల గోచారం సంవత్సరమంతా అనుకూలంగా లేకపోవడం, ఏప్రిల్ నుంచి గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో ప్రథమార్థంలో సామాన్యంగా, ద్వితీయార్థం కొంత అనుకూలంగా ఉంటుంది. సంవత్సరమంతా శని గోచారం పన్నెండవ ఇంట్లో ఉండటం, మరియు ఏప్రిల్ వరకు గురువు గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం వలన ఉద్యోగంలో మీరు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు నచ్చని ప్రదేశానికి బదిలీ కావటం కానీ, మీకు నచ్చని వ్యక్తులతో పనిచేయాల్సి రావడం గానీ జరగచ్చు. అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రథమార్థంలో మీరు మీ మాట విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. రెండవ ఇంటిలో రాహువు గోచరము మరియు రెండవ ఇంటి పైన శని దృష్టి ఉండటం వలన మీరు చాలా సార్లు ఎదుటివారిని నొప్పించే విధంగా మాట్లాడటం కానీ లేదా అహంకార పూరితంగా మాట్లాడటం కానీ రావచ్చు. దాని కారణంగా ఎదుటి వారికంటే ఎక్కువ మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మీ మాట విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సంవత్సరం మీ సహోద్యోగుల సహకారం లేకపోవటం, పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వలన కొన్నిసార్లు మీ వ్యక్తిగత అవసరాలకు మరియు కుటుంబ అవసరాలకు సమయం కేటాయించలేక పోతారు. ఈ సంవత్సరం ప్రథమార్థంలో విదేశాల్లో ఉన్న వారు కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఉద్యోగ విషయంలో ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం వలన వారు ఉద్యోగాల్లో ఇబ్బంది పడకుండా ఉండవచ్చు. ఎనిమిదవ ఇంటిలో కేతువు గోచారం కారణంగా కొన్నిసార్లు పై అధికారుల కారణంగా, సహోద్యోగుల కారణంగా అవమానాలు కాని, ఇబ్బందులు కానీ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు బద్దకాన్ని వదిలి మీ శక్తిపై, మరియు మీ ప్రతిభ పై నమ్మకం ఉంచి పనిచేయటం వలన ఈ సమయంలో ఏర్పడే సమస్యల నుంచి బయట పడవచ్చు. ఏప్రిల్ నుంచి గురువు గోచారం అనుకూలంగా రావటం వలన మీ వృత్తిలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. పదోన్నతి కానీ, ఉద్యోగంలో మంచి మార్పులు కానీ జరగడం వలన కొంతకాలంగా మీరు మీ ఉద్యోగంలో పడుతున్న ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా మీరు పనిచేసే చోట మీ మాటకు విలువ పెరగడమే కాకుండా మీ సహోద్యోగులు కూడా మీకు సహకరిస్తారు. మానసికంగా కూడా మీరు ఉత్సాహంగా మారటం వలన వృత్తి పరంగా ఉన్న ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. శని గోచారం పన్నెండవ ఇంటిలో ఉన్నంతకాలం మీరు ఆలోచనకంటే ఎక్కువగా ఆచరణకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. శని పనిచేసేవారిని ఇష్టపడతాడు, మరియు మంచి ఫలితాలను ఇస్తాడు కాబట్టి మీరు పనులను వాయిదా వేయటం కానీ, అయిష్టంగా పూర్తి చేయడం కానీ చేయకుండా నిజాయితీగా పని చేయడం వలన శని ప్రభావం తగ్గటమే కాకుండా వృత్తిలో కూడా అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో ఉద్యోగం కొరకు ఎదురుచూస్తున్న వారికి అనుకూలమైన ఉద్యోగం లభిస్తుంది. అంతేకాకుండా పదోన్నతి కొరకు గాని, ఉద్యోగంలో బదిలీ కొరకు కానీ ఎదురుచూస్తున్న వారికి ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో వారు కోరుకున్న ఫలితం లభిస్తుంది. ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు రాహు గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన చాలా సార్లు మీరు చెప్పే మాటలకు, చేసే పనులకు సంబంధం లేకుండా ఉండటం వలన ఎదుటివారి నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేయగలిగిందే చెప్పండి తప్ప గొప్పలకు పోయి మీ సామర్ధ్యానికి మించిన పనులను చేస్తానని చెప్పటం కానీ, వాటిని చేయటానికి ప్రయత్నించటం కానీ చేయకండి. ఈ సంవత్సరం మీరు ఇతరులపై ఆధారపడకుండా మీ వృత్తిని సక్రమంగా చేసుకోవడం మంచిది. ఇతరులపై నమ్మకంతో మీరు పనులను వాయిదా వేసుకోవడం కానీ, వదిలేయడం కానీ చేస్తే అది మీకు సమస్యలు తెచ్చి పెట్టే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 మధ్యలో, జూన్ 15 నుంచి జూలై 17 మధ్యలో, అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 16 మధ్యలో వృత్తి పరంగా ఒత్తిడులు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వృత్తి పరంగా ఒత్తిడికి లోనై ఉద్యోగం మారటానికి కానీ, పని చేయకుండా వాయిదా వేయడానికి కానీ ప్రయత్నం చేయకపోవడం మంచిది. ఈ సమయములో మీరు వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండండి, మరియు మీకు ఇచ్చిన బాధ్యతలను నిజాయితీగా పూర్తిచేయండి.

2023వ సంవత్సరం వ్యాపారస్థులకు మరియు స్వయం ఉపాధి కలవారికి ఎలా ఉండబోతోంది?

వ్యాపారస్తులకు, మరియు స్వయం ఉపాధి ద్వారా జీవనం కొనసాగిస్తున్న వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరమంతా 12వ ఇంట్లో శని గోచారం ఉండటం, అక్టోబర్ చివరి వరకు రాహు, కేతువుల గోచారం కూడా అనుకూలంగా లేకపోవడం వలన వ్యాపారంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కుంటారు. ముఖ్యంగా సమయానికి డబ్బు అందకపోవడం వలన లేదా, సరైన ఆదాయం లేక పోవటం వలన మీరు ఈ సంవత్సరం మంచి అవకాశాలను కోల్పోతారు. వ్యాపారంలో అభివృద్ధికి మీరు చేసే పనులు సరైన ఫలితం ఇవ్వక పోవడం వలన మానసికంగా నిరాశకు లోనవుతారు. అయితే ఈ సంవత్సర ప్రథమార్ధంలో గురువు దృష్టి ఏడవ ఇంటిపై ఉండటం వలన మీరు ఒకటికంటే ఎక్కువ సార్లు ప్రయత్నించినట్లయితే వ్యాపారంలో మీరు అనుకున్న ఫలితాన్ని పొందగలుగుతారు. కేతువు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉండటం వలన మీ వ్యాపార భాగస్వాములతో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ మధ్య సరైన అవగాహన లోపించడం వలన వ్యాపారంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఓపికగా ఉండటం, మరియు వివాదాలకు దూరంగా ఉండటం వలన వ్యాపారంలో ఏర్పడిన సమస్యల నుంచి బయట పడతారు. అక్టోబర్ చివరి వరకు రాహువు గోచారం రెండవ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో మీరు పెట్టుబడుల కొరకు ఉపయోగించాల్సిన డబ్బు వేరే విషయాలకు వినియోగించాల్సి రావటం వలన వ్యాపారంలో అభివృద్ధి తగ్గడమే కాకుండా ఆర్థికంగా కూడా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ నుంచి గురువు గోచారం అనుకూలంగా రావడంతో వ్యాపారంలో ఉండే సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీకు అవసరానికి తగిన డబ్బు మీ మిత్రులు, బంధువుల వలన లేదా బ్యాంకులోన్ తీసుకోవడం వలన మీ చేతికి అందడంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేయగలుగుతారు. ఈ సంవత్సరం కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు అనుకునేవారు ఏప్రిల్ తర్వాత వ్యాపార ఆరంభానికి సంబంధించిన పనులు ప్రారంభించడం కానీ, వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ చేయవచ్చు. ఈ సమయంలో గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. సంవత్సరం అంతా శని గోచారం పన్నెండవ ఇంట్లో ఉంటుంది కాబట్టి వ్యాపార సంబంధ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి, ఈ సంవత్సరం ప్రథమార్ధంలో అడ్డంకులు ఎక్కువగా ఉంటాయి. మీకు వచ్చిన అవకాశాలు సమయానికి వాయిదా పడటం కానీ, ఆర్థికంగా లాభదాయకంగా లేకపోవడం కానీ జరగచ్చు. అంతేకాకుండా మీరు మీ ప్రతిభతో సంపాదించుకున్న అవకాశాలను వేరే వారు మోసపూరితంగా తీసుకెళ్లడం వలన మీరు ఇబ్బందికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు పని చేస్తానని చెప్పి చేయకపోవడం వలన లేదా సమయానికి పూర్తి చేయకపోవడం వలన ఇతరుల దృష్టిలో మీరు నిజాయితీ లేని వారిగా, మీ పని పట్ల అంకితభావం లేని వారిగా కనిపిస్తారు. అక్టోబర్ చివరి వరకు రాహువు గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన మీ మాటకు, పనికి సంబంధం లేకుండా ఉండటం వలన కూడా కొన్ని అవకాశాలు దూరం చేసుకుంటారు. సంవత్సరమంతా శని గోచారం పన్నెండవ ఇంటిలో ఉండటం వలన చాలా సార్లు మీ స్వయంకృతాపరాధం వలన మీరు మీకు వచ్చిన అవకాశాలను వదిలేసుకుంటారు. ఏప్రిల్ నుంచి గురువు గోచారం అనుకూలంగా మారడం వలన మీరు చేసే పనులు విజయవంతం అవుతాయి. అంతేకాకుండా, మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభించి మరిన్ని అవకాశాలు పొందుతారు. ఆర్థికంగా కూడా ఈ సమయం అనుకూలించడం వలన మీరు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. గురువు దృష్టి పదవ ఇంటిపై, మరియు ఆరవ ఇంటిపై ఉండటం వలన మీ కీర్తి, ప్రతిష్టలు పెరగటమే కాకుండా మీకు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.

2023వ సంవత్సరం మీ ఆర్థిక స్థితి ఎలా ఉండబోతోంది?

ఈ సంవత్సరం మీన రాశి వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. ప్రథమార్ధంలో గురువు, శని, కేతువు మరియు రాహువు గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఈ సమయం సామాన్యంగా ఉంటుంది. మీ ఆదాయంకంటే ఎక్కువ డబ్బులు ఖర్చవడం లేదా వృధా ఖర్చులు ఎక్కువగా చేయాల్సి రావటం వలన ఈ సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మొహమాటానికి పోయి కానీ, గొప్పలకు పోయి కానీ మీరు డబ్బు ఖర్చు చేయటం వలన డబ్బుకు ఇబ్బంది ఏర్పడి అప్పు చేయడం కానీ, బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం గాని చేసే అవకాశముంటుంది. ఈ సంవత్సరం డబ్బు విషయంలో మీరు నిక్కచ్చిగా ఉండకుంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ నుంచి గురువు గోచారం అనుకూలంగా మారటం వలన ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు గతంలో చేసిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాలను ఇవ్వటం వలన తీసుకున్న అప్పులను తిరిగి తీర్చగలుగుతారు. మీ వృత్తి, వ్యాపారాల్లో కూడా అభివృద్ధి సాధ్యం కావటం వలన ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. అయితే రాహువు, కేతువు, మరియు శని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఈ సంవత్సరమంతా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రథమార్ధంలో ఆర్థిక సంబంధ పెట్టుబడులు అంతగా అనుకూలించవు. ఈ సమయంలో పెట్టుబడి కొరకు వచ్చే అవకాశాలన్నీ మీకు నష్టం చేసేవే అవుతాయి తప్ప లాభం చేసేవి కాదు. ఏప్రిల్ నుంచి గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం అనుకూలిస్తుంది. అయితే ఖచ్చితంగా అనుభవజ్ఞుల, మరియు నిపుణుల సలహా తీసుకొని మాత్రమే పెట్టుబడి పెట్టడం మంచిది. సంవత్సరం చివరలో రాహు మరియు కేతువుల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టడం అంతగా అనుకూలించదు. 12వ ఇంటిలో శని గోచారం కారణంగా అవసరమైన వాటికంటే అనవసరమైన వాటికే ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖర్చు చేసే ప్రతి పైసా మీకు ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించి మాత్రమే ఈ సంవత్సరం ఖర్చు చేయటం మంచిది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 13 నుంచి మార్చి 15 మధ్యలో, జూన్ 15 నుంచి జూలై 17 మధ్యలో మరియు అక్టోబర్ 18 నుంచి నవంబర్ 17 మధ్యలో ఆర్థిక సంబంధమైన లావాదేవీలకు అనుకూలం కాదు. ఈ సమయంలో సూర్యుని గోచారం బాగుండదు కాబట్టి పెట్టుబడులకు మరియు ఇతర ఆర్థిక సంబంధమైన లావాదేవీలకు ఈ సమయం మంచిది కాదు.

2023వ సంవత్సరం మీ ఆరోగ్యం ఎలా ఉండబోతోంది?

ఈ సంవత్సరం మీన రాశిలో జన్మించిన వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏప్రిల్ వరకు గురువు గోచారం, అక్టోబర్ చివరి వరకు రాహు, కేతువుల గోచారం, మరియు సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా లేకపోవడం, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సంవత్సరం ఏలి నాటి శని ప్రారంభం అవడం వలన శని ఇచ్చే చెడు ప్రభావం కారణంగా సంవత్సరం అంతా అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. శని గోచారం కారణంగా ఎముకలు, ఊపిరితిత్తులు, మెడ మరియు మోకాళ్లకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే అక్టోబర్ చివరి వరకు రాహు గోచారం అనుకూలంగా లేకపోవడం వలన దంతములు మరియు జీర్ణాశయానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఈ సమయంలో ఇబ్బంది పెట్టవచ్చు. కేతు గోచారం అక్టోబర్ చివరి వరకు ఎనిమిదవ ఇంటిలో ఉండటం వలన జననాంగాలు, మరియు చర్మ సంబంధ అలర్జీలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అంతేకాకుండా చిన్న, చిన్న విషయాలకే మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం మిమ్మల్ని మీరు ఉత్సాహంగా ఉంచుకోవడమే కాకుండా యోగా, ప్రాణాయామం లాంటి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పద్ధతులను పాటించడం మంచిది. ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు గురు గోచారం ఒకటవ ఇంటిలో సామాన్యంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కాలేయము మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో రోగనిరోధక శక్తి తగ్గడం వలన తరచుగా అలసిపోవడం జరగవచ్చు. ఈ సమయంలో సరైన ఆహారం, మరియు విశ్రాంతి తీసుకోవడం వలన ఈ సంవత్సరం నుంచి బయటపడవచ్చు. ఏప్రిల్ నుంచి సంవత్సరమంతా గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన శని, రాహువు మరియు కేతువు ఇచ్చే చెడు ప్రభావం కూడా తగ్గుతుంది. ఈ సంవత్సరం మార్చి 13 నుంచి మే 10 మధ్య, మరియు అక్టోబర్ 10 నుంచి నవంబర్ 16 మధ్య కుజుడి గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుజుడు ఆవేశాన్ని, అహంకారాన్ని, మరియు కోపాన్ని పెంచే గ్రహం కావటం వలన ఈ సమయంలో కుజుని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన మీరు రక్త సంబంధిత ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటం మంచిది.

2023వ సంవత్సరం మీ కుటుంబ జీవితం ఎలా ఉండబోతోంది?

మీన రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరమంతా శని గోచారం పన్నెండవ ఇంటిలో ఉన్నప్పటికీ గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన కుటుంబ జీవితం సంవత్సరంలో ఎక్కువ భాగం బాగుంటుంది. సంవత్సరమంతా శని దృష్టి రెండవ ఇంటిపై ఉండటం, మరియు రాహు గోచారం అక్టోబర్ చివరి వరకు రెండవ ఇంటిలో ఉండటం వలన కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ మాట తీరు కారణంగా గాని, మీ ప్రవర్తన కారణంగా కానీ ఈ సమయంలో కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మధ్య మనస్పర్థలు ఏర్పడటం కానీ, బంధువులతో వివాదాలు ఏర్పడటం కానీ జరగవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో కొంతకాలం మీ ఉద్యోగ రీత్యా కాని, ఇతర కారణాల రీత్యా కాని మీరు మీ ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఏడవ ఇంటిపై గురువు దృష్టి ఉండటం వలన మీ జీవిత భాగస్వామి సహకారంతో మీకు మీ కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. అక్టోబర్ చివరి వరకు ఎనిమిదవ ఇంటిలో కేతువు గోచారం కారణంగా మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏప్రిల్ నుంచి గురువు దృష్టి ఎనిమిదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వారి ఆరోగ్యం బాగుపడుతుంది. ఏప్రిల్ నుంచి గురువు గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన మీ కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. గతంలో ఉన్న గొడవలు కానీ, మనస్పర్థలు కానీ తగ్గిపోతాయి మరియు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి వినోద యాత్రలు కానీ, విహార యాత్రలు కానీ చేస్తారు. ఈ సంవత్సరం కొన్నిసార్లు మీ మాట అదుపు తప్పే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు ఆవేశానికి లోను కాకుండా మాట్లాడటం మంచిది. ముఖ్యంగా శని గోచారం 12వ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీ లోపల చాదస్తపు ఆలోచనలు ఎక్కువవుతాయి. ఇంటిలో జరిగే ప్రతి విషయాన్ని అతిగా పట్టించుకుని ప్రశ్నించే స్వభావం అలవడుతుంది. దాని వలన మీ కుటుంబ సభ్యులకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఏప్రిల్ నుంచి గురువు గోచారం బాగుంటుంది కాబట్టి ఈ సమస్య తొందరగానే పరిష్కారమవుతుంది, మరియు పట్ల మీ కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు, గౌరవం పెరుగుతాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ తర్వాత, వివాహం కాని వారికి వివాహం అవటం కానీ, సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి సంతాన అవటం కానీ జరుగుతుంది. మీరు మీ కుటుంబంలో పెద్ద వారి సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. దానివలన మీరు ఉద్యోగంలో అభివృద్ధి చెందడమే కాకుండా, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు. ఈ సంవత్సరం చివరలో రాహు గోచారం ఒకటవ ఇంటికి, మరియు కేతువు గోచారం ఏడవ ఇంటికి రావడం వలన భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడటం కానీ, సమస్యలు రావడం గానీ జరగవచ్చు. ముఖ్యంగా ఒకటవ ఇంటిలో రాహువు అహంకారాన్ని, మరియు ఎవరి మాట వినని స్వభావాన్ని ఇస్తాడు. దాని కారణంగా మీ కుటుంబంలో ముఖ్యంగా, మీ జీవిత భాగస్వామితో ఈ సమయంలో మనస్పర్థలు వస్తాయి. మీ ఇంటిలో పెద్ద వారి కారణంగా ఈ మనస్పర్థలు తొందరగానే ముగిసిపోతాయి.

2023వ సంవత్సరం విద్యార్థులకు ఎలా ఉండబోతోంది?

ఈ సంవత్సరం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరమంతా శని గోచారం పన్నెండవ ఇంటిలో ఉండటం వలన విద్యార్థుల ఏకాగ్రత తగ్గడమే కాకుండా, సమయాన్ని ఇతర విషయాల మీద వృధా చేసే అవకాశం ఉంటుంది. శని దృష్టి రెండవ ఇంటిపై, మరియు తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన విద్యార్థులకు చదువు విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీరు ఉపాధ్యాయుల మరియు పెద్దల సహాయ సహకారాలు తీసుకోవటం మంచిది. దాని కారణంగా చదువులో అభివృద్ధి కలగడమే కాకుండా సరైన విధంగా జీవితాన్ని మలుచుకోగలుగుతారు. ఏప్రిల్ వరకు గురు గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో విద్యార్థుల్లో అహంకారం పెరగడం కానీ, ఎవరి మాటా వినని స్వభావం అలవాటు అవడం గానీ జరగవచ్చు. అయితే ఈ సమయంలో గురువు దృష్టి తొమ్మిదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి గురువుల, మరియు పెద్ద వారి సహకారంతో విద్యార్థులు తమ తప్పులను సరి దిద్దుకునే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ నుంచి గురువు గోచారం రెండవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన వీరికి చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. అంతేకాకుండా పరీక్షల్లో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఉత్సాహం పెరగటం మరియు దాని కొరకు కృషి చేయటం వలన మీరు పరీక్షల్లో సాధించిన విజయాలతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకో కలుగుతారు. అంతేకాకుండా వారి కుటుంబానికి కూడా పేరు తీసుకొస్తారు. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులు ఈ సంవత్సరం కఠినంగా శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. 12వ ఇంట్లో శని గోచారం కారణంగా మంచి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందడానికి విద్యార్థులు ఎక్కువగా ప్రయత్నించాల్సి ఉంటుంది, కాబట్టి ఈ విషయంలో నిరాశ చెందకుండా ప్రయత్నించడం మంచిది. ఉద్యోగార్థులకు మరియు పోటీ పరీక్షలు రాసే వారికి ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో అనుకున్న ఫలితం లభిస్తుంది.

2023వ సంవత్సరం ఏ గ్రహాలకు, ఏయే పరిహారాలు చేయాలి?

ఈ సంవత్సరం మీన రాశి వారు శనికి, రాహువుకు, కేతువుకు మరియు గురువుకు పరిహారాలు చేయటం మంచిది. ఈ సంవత్సరం ఏలి నాటి శని ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతిరోజు కానీ, ప్రతి శనివారం కానీ శని స్తోత్ర పారాయణం చేయటం, శని మంత్ర జపం చేయటం మంచిది. అంతేకాకుండా మీ జీవన విధానాన్ని కూడా ఈ సమయంలో మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా బద్ధకానికి తావివ్వకుండా మీరు పనికి, సేవకు ప్రాధాన్యత ఇవ్వటం వలన శని ప్రభావం తగ్గడమే కాకుండా శని ఇచ్చే శుభ ఫలితాలు కూడా మీకు అనుభవానికి వస్తాయి. ఈ సంవత్సరమంతా రాహు గోచారం రెండవ, మరియు ఒకటవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో రాహువు ఇచ్చే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు మరియు మానసిక ఆరోగ్య సమస్యలు తొలగిపోవడానికి, శుభ ఫలితాలు రావడానికి ప్రతిరోజు కానీ, ప్రతి శనివారం కానీ రాహు స్తోత్రం పారాయణం చేయటం, రాహు మంత్ర జపం చేయటం మంచిది. అలాగే రాహు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రతిరోజు దుర్గా స్తోత్రం పారాయణం చేయడం లేదా దుర్గా దేవి పూజ చేయటం మంచిది. ఈ సంవత్సరమంతా కేతువు గోచారం ఎనిమిదవ, మరియు ఏడవ ఇళ్లలో ఉంటుంది కాబట్టి కేతువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి మరియు ఆరోగ్య సమస్యలు తగ్గటానికి ప్రతిరోజు కానీ, ప్రతి మంగళవారం కానీ కేతు స్తోత్రం పారాయణం చేయటం, కేతు మంత్ర జపం చేయటం మంచిది. అంతేకాకుండా కేతు ప్రభావాన్ని తగ్గించుకోవటానికి ప్రతిరోజు గణపతి స్తోత్రం పారాయణం చేయటం కానీ, గణపతి పూజ చేయడానికి గానీ మంచిది. ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు గురువు గోచారం ఒకటవ ఇంటిలో ఉంటుంది కాబట్టి గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు కానీ, ప్రతి గురువారం కానీ గురు స్తోత్ర పారాయణం చేయటం కానీ, గురు మంత్ర జపం చేయటం కానీ మంచిది.

రాజాది నవనాయక ఫలితములు

12 రాశుల ఆదాయ, వ్యయాలు

27 నక్షత్రాల నక్షత్రాల కందాయ ఫలములు

శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలములు

Aries
Mesha rashi,year 2026 rashi phal for ... rashi
Taurus
vrishabha rashi, year 2026 rashi phal
Gemini
Mithuna rashi, year 2026 rashi phal
Cancer
Karka rashi, year 2026 rashi phal
Leo
Simha rashi, year 2026 rashi phal
Virgo
Kanya rashi, year 2026 rashi phal
Libra
Tula rashi, year 2026 rashi phal
Scorpio
Vrishchika rashi, year 2026 rashi phal
Sagittarius
Dhanu rashi, year 2026 rashi phal
Capricorn
Makara rashi, year 2026 rashi phal
Aquarius
Kumbha rashi, year 2026 rashi phal
Pisces
Meena rashi, year 2026 rashi phal

 

Vedic Horoscope

 

Free Vedic Janmakundali (Horoscope) with predictions in English. You can print/ email your birth chart.

Read More
  

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhati Horoscope) with predictions in Hindi.

Read More
  
 

Telugu Jatakam

 

Detailed Horoscope (Telugu Jatakam) in Telugu with predictions and remedies.

 Read More
  
 

Newborn Astrology

 

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in English.

Read More
  

Contribute to onlinejyotish.com

QR code image for Contribute to onlinejyotish.com
Contribute via UPI (For Indians)

People living in other countries, contribute via PayPal.

Why Contribute?

  • Support the Mission: Your contributions help us continue providing valuable Jyotish (Vedic Astrology) resources and services to seekers worldwide for free.
  • Maintain & Improve: We rely on contributions to cover website maintenance, development costs, and the creation of new content.
  • Show Appreciation: Your support shows us that you value the work we do and motivates us to keep going.
You can support onlinejyotish.com by sharing this page by clicking the social media share buttons below if you like our website and free astrology services. Thanks.

Random Articles