Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2021 samvatsara Meena rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Meena Rashi in Telugu

పూర్వాభాద్ర 4వ పాదం (ది)
ఉత్తరాభాద్ర 4 పాదాలు (దు, శం, ఝ, థ)
రేవతి 4 పాదాలు (దే, దో, చ, చి)
ఈ సంవత్సరం బృహస్పతి మినహా మిగిలిన అన్ని ఇతర నెమ్మదిగా కదిలే గ్రహాలు ప్రస్తుతం తామున్న రాశులపై తమ సంచారాన్ని కొనసాగిస్తాయి. శని మకర రాశిలో పదకొండవ ఇంటిలో, రాహువు 3వ ఇంటిలో వృషభ రాశిలో, కేతువు వృశ్చిక రాశిలో తొమ్మిదవ స్థానంలో ఈ సంవత్సరమంతా ఉంటారు. గురుడు ఏప్రిల్ 6న కుంభ రాశిలో పన్నెండవ ఇంటిలో ప్రవేశిస్తాడు. వక్రగతి పొందిన తరువాత 14 సెప్టెంబర్ నాడు మకర రాశిలో 11వ ఇంటిలో తిరిగి తన సంచారాన్ని కొనసాగిస్తాడు, నవంబర్ 20న గురుడు మళ్లీ కుంభ రాశిలో పన్నెండవ ఇంటిలో ప్రవేశిస్తాడు.
ఈ సంవత్సరం, మీన రాశి వారికి ప్రథమార్థం చాలా అనుకూలంగా, ద్వితీయార్థం మిశ్రమంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు గోచారం మరియు శని గోచారం పదకొండవ ఇంటిలో ఉండటం వలన ఈ సమయం వృత్తి పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వృత్తిలో, మీరు అనుకున్న విధంగా అభివృద్ధి చెందుతారు. మీరు చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా మీ పై అధికారుల ప్రశంసలు పొందటం, మీ సహోద్యోగులు అందుకోవడం జరుగుతుంది. మీరు సమయానికి పూర్తి చేసిన పనుల వలన మీతో పాటు మీ సహోద్యోగులకు కూడా లాభం చేకూరుతుంది. పదోన్నతుల కొరకు కానీ, వేరే ప్రదేశానికి మార్పు కొరకు ఎదురుచూస్తున్న వారికి ఏప్రిల్ లోపు అనుకూలమైన ఫలితం అందుతుంది. మూడవ ఇంటిలో రాహువు ఉండటం వలన, మీరు ధైర్యంతో, తెగింపుతో, ఇతరులు చేయడానికి భయపడుతున్న పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. దానివలన మీరు సమాజంలో గుర్తింపు పొందుతారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో గురువు పన్నెండవ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో మీరు చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అంతేకాకుండా మీకు రావల్సిన గుర్తింపు రాకపోవడం కానీ, లేదా అనుకున్నంత గుర్తింపు రాకపోవడం కానీ జరుగుతుంది. అయితే గుర్తింపు వచ్చినా, రాకున్నా మీ పని మీరు ఉత్సాహంగా నిజాయితీగా చేసుకుంటూపోతారు. మీ వృత్తిలో పేరు ప్రతిష్ఠలు వచ్చినప్పటికీ ఆదాయ పరంగా ఈ సమయం సామాన్యంగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం పొందకపోవడం కానీ లేదా చేసిన పని ఫలితాన్ని ఇతరులకు వదిలేయటం జరుగుతుంది. మీరు చేసే సహాయం మీ సహోద్యోగులు మీ పై అధికారులు లాభపడతారు. దానివలన మీరు మానసిక సంతృప్తిని పొందుతారు. గతంలో ఆగిపోయిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ మిత్రులు మరియు శ్రేయోభిలాషులకు సహాయంతో కష్టమైన పనులు కూడా సులువుగా పూర్తి చేస్తారు.
కుటుంబ పరంగా, ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురువు మరియు శని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరగటం జరుగుతుంది. గతంలో ఉన్న వివాదాలు కానీ సమస్యలు గానీ తొలగిపోతాయి. అయితే మీ వృత్తి కారణంగా కానీ, ఇతర పనుల వల్ల కానీ మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపక పోవచ్చు. మీ సమస్యను కుటుంబ సభ్యులు అర్థం చేసుకొని మీకు పూర్తి సహకారం అందిస్తారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్యలో గురువు గోచారం కొంత సామాన్యంగా ఉండటం వలన ఈ సమయంలో మీకు గాని మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కానీ ఆరోగ్య సమస్యలు రావడం కానీ లేదా ఇతర వివాదాలు రావడం వల్ల కానీ మానసిక ప్రశాంతతను కోల్పోతారు. అయితే శని మరియు రాహువు ల గోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ సమస్య నుంచి ధైర్యంగా బయటపడతారు. మీ ఇంటిలో వివాహం గురించి ఎదురుచూస్తున్న వారికి కానీ సంతానం గురించి ఎదురుచూస్తున్న వారికి కానీ ఈ సంవత్సరం అనుకున్న ఫలితం లభిస్తుంది. మీ తోబుట్టిన వారివల్ల కానీ, మీ మిత్రుల వల్ల కానీ, వారి సహాయంతో ఒక సమస్య నుంచి బయట పడగలుగుతారు. గురు దృష్టి పంచమ స్థానం పై, అలాగే సప్తమ స్థానంలో ఉండటం వలన మీ పిల్లలకు మరియు మీ జీవిత భాగస్వామికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. వారికి వారి వారి రంగాల్లో విజయం సాధిస్తారు.
ఈ సంవత్సరం ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు మరియు శని ఏప్రిల్ వరకు 11 ఇంటిలో అత్యంత అనుకూలమైన గోచారం ఉండటంతో మీరు ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ వృత్తి, వ్యాపారాల కారణంగా ఆదాయం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా, మీరు పెట్టిన పెట్టుబడి నుంచి కూడా లాభాలు రావడంతో ఆర్థికంగా ఉన్నతిని సాధిస్తారు. గతంలో చేసిన అప్పులు కానీ, తీసుకున్న లోన్ లు కానీ తిరిగి తీరుస్తారు. సంవత్సరం అంతా రాహువు గోచారము అనుకూలంగా ఉండటంతో మీరు కొంత రిస్క్ తీసుకొని పెట్టిన పెట్టుబడులు కూడా అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్యలో గురువు గోచారం పన్నెండవ ఇంటిలో ఉండడంతో, ఈ సమయంలో ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అనుకోని ఖర్చులు మీద పడటం కానీ, మీ వృత్తి కారణంగా లేదా వ్యాపారం కారణంగా అపరాధ రుసుము కానీ లేదా అనుకొని చెల్లింపులు కానీ చేయాల్సి వస్తుంది. అయితే, ఆదాయం పరంగా అనుకూలంగా ఉండటంతో చెల్లింపులకు గాని, ఖర్చుల విషయంలో గాని ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఈ సంవత్సరం ఏప్రిల్ లోపు కానీ, సెప్టెంబర్ తర్వాత కానీ గృహము లేదా వాహనం లేదా స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్యలో పెట్టుబడుల విషయంలో కానీ, కొనుగోళ్ల విషయంలో కానీ కొంత జాగ్రత్త అవసరం. తొందరపడి కొనటం వలన ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.
ఆరోగ్య విషయంలో, ఈ సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా, ద్వితీయార్థం కొంత సామాన్యంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురువు మరియు శని పదకొండవ సంచరించడం వలన ఆరోగ్య విషయంలో గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. మీ జీవన విధానం మెరుగుపడుతుంది. రాహువు గోచారము కూడా అనుకూలంగా ఉండటం వలన మానసికంగా కూడా స్థిరత్వం వస్తుంది. మీలో ఉన్న చెడు అలవాట్లు కానీ, భయాలు కానీ తొలగిపోతాయి. గతంలో ఉన్న మానసిక ఒత్తిడి తగ్గి పోయి ప్రశాంతం గా ఉంటారు. ఏప్రిల్ నుంచి గురువు గోచారం పన్నెండవ ఇంటిలో ఉండటం వలన ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆహార విషయంలో అలాగే చేసే పని విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆహారం సమయానికి తీసుకోవడం మరియు అతిగా పని చేయకుండా తగినంత విశ్రాంతి తీసుకోవడం చేయండి. ఈ సమయంలో గురు అనుకూలంగా ఉండదు కాబట్టి వెన్నెముక, కాళ్లు, కాలేయం మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే శని మరియు రాహువు అనుకూలంగా ఉండటం వలన ఈ సమస్యలు తొందరలోనే తగ్గిపోతాయి. మిగతా సంవత్సరమంతా ఆరోగ్యం విషయంలో ఎటువంటి భయాలు అవసరం లేదు
విద్యార్థులకు ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ వరకూ గురువు, మరియు సంవత్సరం అంతా శని మరియు రాహువు అనుకూలంగా ఉండటం వలన చదువులో బాగా రాణిస్తారు. మీరు ఎంచుకున్న సబ్జెక్టులో ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణులు అవుతారు. చదువు మీద ఆసక్తి పెరగడమే కాకుండా, ఇతరులకు కూడా వారు బాగా చదవడానికి సాయపడతారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్యలో గురువు గోచారం పన్నెండవ ఇంటిలో ఉండటం వలన చదువులో ఏకాగ్రత కోల్పోవడం కానీ లేదా సమయాన్ని వేరే విషయాలపై వెచ్చించడం గానీ చేస్తారు. దానివలన పరీక్షల్లో అనుకున్న ఫలితం రాకపోవచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకు అహంకారానికి, నిర్లక్ష్యానికి చోటివ్వకుండా శ్రద్ధగా చదువుకోవడం వలన మీరు అనుకున్న లక్ష్యానికి చేరుకోగలుగుతారు. విదేశాలలో చదువు కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితం ఉంటుంది. కాంపిటీటివ్ పరీక్షలు రాస్తున్న వారికి కూడా అనుకూలమైన ఫలితం ఉంటుంది.
ఈ సంవత్సరం ఒక గురువు మినహా మిగిలిన గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. గురువు కూడా ఏప్రిల్ వరకు పదకొండవ ఇంటిలో సంచరిస్తాడు కాబట్టి మీకు సమస్యలు పెద్దగా ఉండవు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో గురువు పన్నెండవ ఇంటిలో సంచరిస్తాడు. దీని కారణంగా మీకు ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చెడు ప్రభావం తగ్గించడానికి ప్రతిరోజు గురు స్తోత్ర పారాయణం చేయడం కానీ, గురు చరిత్ర పారాయణం చేయడం కానీ లేదా గురు మంత్ర జపం చేయడం కానీ మంచిది. దీనివలన గురు వచ్చే చెడు ఫలితాలు తగ్గి అనుకూలంగా ఈ సంవత్సరం ఉంటుంది.
Free KP Janmakundali (Krishnamurthy paddhati Horoscope) with predictions in Hindi.
Read MoreCheck June Month Horoscope (Rashiphal) for your Rashi. Based on your Moon sign.
Read MoreFree Vedic Janmakundali (Horoscope) with predictions in Telugu. You can print/ email your birth chart.
Read MoreKnow your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Telugu.
Read More
People living in other countries, contribute via PayPal.