ఈ సంవత్సరం బృహస్పతి మినహా మిగిలిన అన్ని ఇతర నెమ్మదిగా కదిలే గ్రహాలు ప్రస్తుతం తామున్న రాశులపై తమ సంచారాన్ని కొనసాగిస్తాయి. శని మకర రాశిలో , వృషభ రాశిలో రాహువు, వృశ్చిక రాశిలో కేతువు, సంవత్సరమంతా ఉంటారు. గురుడు ఏప్రిల్ 06న కుంభ రాశిలో ప్రవేశిస్తాడు. వక్రగతి పొందిన తరువాత 14 సెప్టెంబర్ నాడు మకర రాశిలో తిరిగి తన సంచారాన్ని కొనసాగిస్తాడు. నవంబర్ 20న గురుడు మళ్లీ కుంభరాశిలో ప్రవేశిస్తాడు.
Aries![]() | Taurus![]() | Gemini![]() |
Cancer![]() | Leo![]() | Virgo |
Libra![]() | Scorpio![]() | Sagittarius![]() |
Capricorn![]() | Aquarius | Pisces |
కలియుగ ప్రమాణము 4 లక్షల 32 వేల సంవత్సరములు. శ్వేత వరాహకల్పమునందలి ఏడవదైన వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగమునందలి కలియుగ ప్రథమ పాదములో 5121వది, ప్రభవాది 60 సంత్సరాలలో 34వది యైన ఈ సంవత్సరము చాంద్రమానమున స్వస్తిశ్రీ ప్లవ నామ సంవత్సరంగా చెప్పబడుతున్నది.
ఈ ప్లవ నామ సంవత్సరంలో రాజులకు యుద్దములు, అతివృష్టి, రోగ బాధలు ఎక్కువగా ఉంటాయి. లోకములు అధర్మముతో నిండి, ధన మూల యుద్ధములతో, స్వల్ప వృష్టి, స్వల్ప సస్యములతో కూడి యుండును.
| రాజు | చైత్ర శుద్ధపాడ్యమి వారాధిపతి | కుజుడు |
| మంత్రి | మేష సంక్రమణ దినాధిపతి | బుధుడు |
| సేనాధిపతి | సింహ సంక్రమణ దినాధిపతి | చంద్రుడు |
| సస్యాధిపతి | కర్క సంక్రమణ దినాధిపతి | శుక్రుడు |
| ధాన్యాధిపతి | ధనూ సంక్రమణ దినాధిపతి | గురువు |
| అర్ఘాధిపతి | మిథున సంక్రమణ దినాధిపతి | కుజుడు |
| మేఘాధిపతి | ఆర్ద్రాప్రవేశ దినాధిపతి | కుజుడు |
| రసాధిపతి | తులా సంక్రమణ దినాధిపతి | సూర్యుడు |
| నీరసాధిపతి | మకర సంక్రమణ దినాధిపతి | శుక్రుడు |
ఉపనాయకులు | ||
| పురోహితుడు | వృషభ సంక్రమణ దినాధిపతి | శుక్రుడు |
| పరీక్షకుడు | కన్యా సంక్రమణ దినాధిపతి | గురువు |
| గణకుడు | కుంభ సంక్రమణ దినాధిపతి | శని |
| గ్రామపాలకుడు | వృశ్చిక సంక్రమణ దినాధిపతి | కుజుడు |
| దైవజ్ఞుడు | మీన సంక్రమణ దినాధిపతి | చంద్రుడు |
| రాష్ట్రాధిపతి | ఉగాది వారాధిపతి | కుజుడు |
| సర్వదేశోద్యోగపతి | మేష సంక్రమణ దినాధిపతి | బుధుడు |
| గజాధిపతి | వృషభ సంక్రమణ దినాధిపతి | శుక్రుడు |
| పశునాం అధిపతి | మిథున సంక్రమణ దినాధిపతి | కుజుడు |
| దేవాధిపతి | కర్క సంక్రమణ దినాధిపతి | శుక్రుడు |
| నరాధిపతి | సింహ సంక్రమణ దినాధిపతి | చంద్రుడు |
| గ్రామనాయకుడు | కన్యా సంక్రమణ దినాధిపతి | గురువు |
| వస్త్రాధిపతి | తులా సంక్రమణ దినాధిపతి | సూర్యుడు |
| రత్నాధిపతి | వృశ్చిక సంక్రమణ దినాధిపతి | కుజుడు |
| వృక్షాధిపతి | ధనూ సంక్రమణ దినాధిపతి | గురువు |
| జంగమాధిపతి | మకర సంక్రమణ దినాధిపతి | శుక్రుడు |
| సర్పాధిపతి | కుంభ సంక్రమణ దినాధిపతి | శని |
| మృగాధిపతి | మీన సంక్రమణ దినాధిపతి | చంద్రుడు |
| శుభాధిపతి | సంవత్సరాది తిథి అధిపతి | కుజుడు |
| స్త్రీణాం అధిపతి | ఆర్ద్రాప్రవేశ దినాధిపతి | కుజుడు |
తెలుగు జాతకం, వధూవర గుణమేళనం, కెపి జాతకం, శిశుజాతకం, రాశిఫలములు, పంచాంగం మరియు జ్యోతిష పాఠాలతో కూడిన నం.1 ఆండ్రాయిడ్ అప్లికేషన్ తెలుగుజాతకం ను డౌన్ లోడ్ చేయటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Check your horoscope for Kalasarpa dosh, get remedies suggestions for Kasasarpa dosha.
Read MoreCheck your horoscope for Mangal dosh, find out that are you Manglik or not.
Read MoreCheck your horoscope for Mangal dosh, find out that are you Manglik or not.
Read More
People living in other countries, contribute via PayPal.