OnlineJyotish.com

జూన్ 2024 రాశి ఫలాలు - వృషభ రాశి - జూన్ నెల వృషభ రాశి జాతకం

వృషభ రాశి June జూన్ 2024 రాశి ఫలములు

Vrishabha Rashi - Rashiphalalu June 2024

June జూన్ నెలలో వృషభ రాశి వారి గోచార ఫలములు - ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థికస్థితి, కుటుంబం మరియు వ్యాపారం గురించి పూర్తి వివరాలు.

image of Vrishabh Rashiవృషభం రాశి చక్రంలో రెండవ రాశి. ఇది రాశిచక్రం యొక్క 30-60వ డిగ్రీలను కలిగి ఉంటుంది. కృత్తిక (2, 3, 4 పాదములు), రోహిణి (4 పాదములు), మృగశిర (1, 2 పాదములు) కింద జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందకు వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు.

వృషభ రాశి - జూన్ నెల రాశిఫలాలు



వృషభ రాశి వారికి ఈ జూన్ నెల ఒకటవ తేదీన కుజుడు మీ రాశి నుంచి 11వ ఇల్లైన మీనరాశి నుంచి, 12వ ఇల్లైన మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు 12వ తేదీ వరకు, 1వ ఇల్లైన వృషభ రాశిలో సంచరించి ఆ తర్వాత, 2వ ఇల్లైన మిథున రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. బుధుడు ఈనెల 14వ తేదీన, మీ రాశికి 1వ ఇల్లైన వృషభ రాశి నుంచి, 2వ ఇల్లైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మిథున రాశిలో 29వ తేదీ వరకు సంచరించి ఆ తర్వాత, 3వ ఇల్లైన కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. ఈనెల 15వ తేదీ వరకు సూర్యుడు, 1వ ఇల్లైన వృషభ రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత తన సంచారాన్ని, 2వ ఇల్లైన మిధున రాశిలో కొనసాగిస్తాడు. గురువు ఈ నెల అంతా సంచారాన్ని, 1వ ఇల్లైన వృషభ రాశిలో కొనసాగిస్తాడు. శని 10వ ఇల్లైన కుంభరాశిలో, రాహువు, 11వ ఇల్లైన మీనరాశిలో, మరియు కేతువు, 5వ ఇల్లైన కన్యారాశిలో తమ సంచారాన్ని ఈ నెలంతా కొనసాగిస్తారు.
ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితం ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మరియు కెరీర్ లో కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఉద్యోగంలో, ఈ నెల ప్రధమార్థంలో సాధారణ పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా మీ పై అధికారుల కారణంగా మీకు చాలా పనిభారం మరియు సమస్యలు ఉంటాయి. మీ అభిప్రాయాలను కానీ, ఆలోచనలను కానీ గౌరవించకపోవడం వలన అసహనానికి గురయ్యే అవకాశం ఉంటుంది. మీరు మీ పై అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మొదటి వారంలో కొన్ని మార్పులు లేదా ఊహించని ప్రయాణం సూచించబడుతుంది. మీరు ఆశించిన ఫలితాన్ని పొందడానికి చాలా కష్టపడాల్సి రావచ్చు. మీకు అనవసరమైన సమస్యలు మరియు అవమానాలను కలిగించవచ్చు కనుక, ఇతర పనిలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు. ద్వితీయార్థంలో పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది.
ఆర్థికంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొదటి రెండు వారాలు మీకు ఖర్చు ఎక్కువగా ఉండటం మరియు ఆదాయం తక్కువగా ఉండటం జరగవచ్చు. మూడవ వారం నుండి, మీరు ఆదాయంలో మంచి వృద్ధిని చూస్తారు మరియు వ్యయంలో తగ్గుదలను చూస్తారు. చాలాకాలం నుంచి మీకు రాకుండా ఆగిపోయిన డబ్బు ఈ నెలలో మీకు అందటం వలన ఆర్థిక భారం కొంత మేరకు తగ్గుతుంది.
కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది; మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి మద్దతు లభించవచ్చు, మరియు మీరు కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరు కావొచ్చు. ఈ నెలలో మీరు ఇల్లు లేదా ఆస్తి యొక్క లావాదేవీలు పూర్తి చేయవచ్చు. మీ సంతానం కారణంగా మీరు ఆనందాన్ని పొందుతారు.
ఆరోగ్య పరంగా ఈ నెలలో కొంచెం సాధారణంగా ఉంటుంది. ఈ నెల ప్రథమార్థంలో మీరు కళ్లు సంబంధ సమస్యలు కానీ, తలనొప్పి లేదా జ్వరంతో బాధపడవచ్చు, ముఖ్యంగా మొదటి రెండు వారాల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. ద్వితీయార్థంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ నెలలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం మరియు ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.
వ్యాపారంలో ఉన్నవారు సాధారణ ఈ నెలలో సాధారణ ఎదుగుదలను కలిగి ఉంటారు, ఎందుకంటే మీరు చేపట్టిన ప్రతి పనిలో కొన్ని అడ్డంకులు మరియు ఆలస్యాలు ఉంటాయి. కాబట్టి, ఈ నెలలో ఎలాంటి కొత్త వ్యాపారం/వెంచర్ ప్రారంభించకపోవడం మంచిది. వ్యాపార సంబంధ పెట్టుబడుల విషయంలో కూడా ఈ నెల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆవేశానికి లేదా తొందరపాటుకు లోనయ్యి పెట్టే పెట్టుబడులు నష్టాలను ఇచ్చే అవకాశం ఉంటుంది.
విద్యార్థులు తమ చదువుపై మరింత దృష్టి పెట్టాలి, ఎందుకంటే వారు ఏకాగ్రత మరియు అధ్యయనాలపై ఆసక్తిని కోల్పోవచ్చు. ఈనెల ఆవేశం తగ్గించుకోవడం మరియు ప్రశాంతంగా ఉండటం మంచిది. ముఖ్యంగా మీ స్నేహితులు కానీ, సహ విద్యార్థులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.




Please Note: All these predictions are based on planetary transits and Moon sign based predictions. These are just indicative only, not personalised predictions.