సింహ రాశి రాశిచక్రంలో ఐదవ రాశి. ఇది రాశిచక్రంలో 120-150 డిగ్రీలను కలిగి ఉంటుంది. మఖ (4 పాదాలు), పూర్వాఫల్ఘుని (పుబ్బ) (4 పాదాలు), ఉత్తర ఫల్గుని (1 వ పాదాలు) కింద జన్మించిన వ్యక్తులు సింహా రాశి కిందకు వస్తారు. ఈ రాశి వారికి ప్రభువు సూర్యుడు.
సింహ రాశి వారికి ఈ జూన్ నెల ఒకటవ తేదీన కుజుడు మీ రాశి నుంచి 8వ ఇల్లైన మీనరాశి నుంచి, 9వ ఇల్లైన మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు 12వ తేదీ వరకు, 10వ ఇల్లైన వృషభ రాశిలో సంచరించి ఆ తర్వాత, 11వ ఇల్లైన మిథున రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. బుధుడు ఈనెల 14వ తేదీన, మీ రాశికి 10వ ఇల్లైన వృషభ రాశి నుంచి, 11వ ఇల్లైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మిథున రాశిలో 29వ తేదీ వరకు సంచరించి ఆ తర్వాత, 12వ ఇల్లైన కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. ఈనెల 15వ తేదీ వరకు సూర్యుడు, 10వ ఇల్లైన వృషభ రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత తన సంచారాన్ని, 11వ ఇల్లైన మిధున రాశిలో కొనసాగిస్తాడు. గురువు ఈ నెల అంతా సంచారాన్ని, 10వ ఇల్లైన వృషభ రాశిలో కొనసాగిస్తాడు. శని 7వ ఇల్లైన కుంభరాశిలో, రాహువు, 8వ ఇల్లైన మీనరాశిలో, మరియు కేతువు, 2వ ఇల్లైన కన్యారాశిలో తమ సంచారాన్ని ఈ నెలంతా కొనసాగిస్తారు.
ఈ నెల మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగ విషయంలో ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారు, మరియు ఆర్థికంగా ఈ నెలలో మీకు సంతృప్తి ఉంటుంది. ఉద్యోగ పరంగా ఈనెల మీకు మంచి సమయం ఉంటుంది. మీ పై అధికారులు మరియు మీ సహోద్యోగుల నుంచి మీరు ప్రశంసలు పొందవచ్చు. ఉద్యోగంలో పదోన్నతి పొందడం కానీ లేదా అనుకున్న స్థానానికి బదిలీ అవ్వడం కానీ జరుగుతుంది. మీరు మీ పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీరు ఉద్యోగంలో మార్పు లేదా కొత్త ఉద్యోగం లేదా బదిలీ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే, ఈ నెలలో మీరు అనుకున్న ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగ విషయంలో పోయిన నెలలో ఈ నెలలో తగ్గుముఖం పడుతుంది. ఈనెల ద్వితీయార్థంలో ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.
ఆర్థికంగా ఈ నెల అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. మీకు మంచి డబ్బు ప్రవాహం ఉంటుంది. ఈ నెలలో వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నట్లయితే, ఇది దానికి సరైన నెల. మీరు గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి కూడా ఈ నెలలో లాభాలు వస్తాయి. ముఖ్యంగా ద్వితీయార్థంలో స్థిరాస్తుల కారణంగా ఆర్థిక లాభాలు ఉంటాయి.
కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది. మీరు మీ పాత స్నేహితులను కలుసుకోవచ్చు మరియు వారితో పార్టీ లేదా ఫంక్షన్ ను ఆస్వాదించవచ్చు. మీ కుటుంబ సభ్యులతో కూడా మీరు ప్రయాణం చేయవచ్చు. గత కొంతకాలంగా మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. మీ సోదరులు లేదా బంధువుల సహాయంతో స్థిరాస్తి ఒప్పందాలు లేదా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ నెలలో పుణ్యక్షేత్ర సందర్శన కానీ దూర ప్రయాణం కానీ ఉంటుంది.
ఈ నెలలో ఆరోగ్య పరంగా మంచిది, ఎందుకంటే ఎలాంటి పెద్ద ఆరోగ్య సమస్య సూచించబడలేదు. మీరు ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు. ఈనెల ప్రధమార్ధంలో కొన్ని సాధారణ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శని మరియు రాహు గోచారం బాగుండదు కాబట్టి ఎముకలు మరియు గ్యాస్ట్రిక్ సంబంధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. ద్వితీయార్థంలో ఆరోగ్యం మెరుగు పడుతుంది.
వ్యాపారవేత్తలకు విజయవంతమైన నెల ఉంటుంది. వారు అమ్మకాలు మరియు ఆదాయంలో పెరుగుదలను చూస్తారు. వ్యాపారంపై డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునే వారు లేదా తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారు ఈ నెలలో చేయవచ్చు. ఈనెల ప్రథమార్ధంలో భాగస్వామ్య ఒప్పందాల విషయంలో జాగ్రత్త అవసరం. ఎందుకంటే మిమ్మల్ని తప్పుదోవ పట్టించి ఒప్పందాలు పూర్తిచేసే అవకాశం ఉంటుంది.
విద్యార్థులకు ఈనెల అనుకూల సమయం ఉంటుంది. ఎక్కువ కష్ట పడకుండా వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. అయితే 8వ ఇంటిపై రాహు గ్రహ సంచారం కారణంగా సోమరితనం పెరగటం మరియు చదువుపై ఆసక్తి తగ్గడం జరగవచ్చు. అంతేకాకుండా చదువు విషయంలో నిర్లక్ష్య ధోరణి కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి.
| మేష రాశి |
వృషభ రాశి |
మిథున రాశి |
| కర్కాటక రాశి |
సింహ రాశి |
కన్యా రాశి |
| తులా రాశి |
వృశ్చిక రాశి |
ధనుస్సు రాశి |
| మకర రాశి |
కుంభ రాశి |
మీన రాశి |
Please Note: All these predictions are based on planetary transits and Moon sign based predictions. These are just indicative only, not personalised predictions.
Your birth chart shows your potential, but Prashna Jyotish can give you an answer for the present moment. Find out what the stars say about your situation today.
Get Your Answer Now
Hindu Jyotish App. Multilingual Android App. Available in 10 languages.
If you're searching for your ideal life partner and struggling to decide who is truly compatible for a happy and harmonious life, let Vedic Astrology guide you. Before making one of life's biggest decisions, explore our free marriage matching service available at onlinejyotish.com to help you find the perfect match. We have developed free online marriage matching software in
Telugu,
English,
Hindi,
Kannada,
Marathi,
Bengali,
Gujarati,
Punjabi,
Tamil,
Malayalam,
Français,
Русский,
Deutsch, and
Japanese
. Click on the desired language to know who is your perfect life partner.
The Hindu Jyotish app helps you understand your life using Vedic astrology. It's like having a personal astrologer on your phone!
Here's what you get:
Daily, Monthly, Yearly horoscope: Learn what the stars say about your day, week, month, and year.
Detailed life reading: Get a deep dive into your birth chart to understand your strengths and challenges.
Find the right partner: See if you're compatible with someone before you get married.
Plan your day: Find the best times for important events with our Panchang.
There are so many other services and all are free.
Available in 10 languages: Hindi, English, Tamil, Telugu, Marathi, Kannada, Bengali, Gujarati, Punjabi, and Malayalam.
Download the app today and see what the stars have in store for you! Click here to Download Hindu Jyotish App