OnlineJyotish.com

రాశి ఫలములు June జూన్ నెల 2024 - Telugu Rashi Phalamulu

రాశిఫలములు June జూన్ 2024

June జూన్ 2024 ఉద్యోగం, విద్య, కుటుంబం, ఆరోగ్యం, వ్యాపారం మరియు ఆర్థిక స్థితి సంబంధ గోచార ఫలములు

మా ఈ నెల జాతకం లేదా రాశిఫలములు విభాగానికి స్వాగతం, ఈ ఫలితాలు చంద్రుడి రాశి ఆధారంగా ఉంటాయి. సూర్యుడు, కుజుడు, శుక్ర, బుధుల మాసపు గోచారం ఈ రాశిఫలములలో పరిగణించబడతాయి. ఈ నెల రాశిఫలములు చదవటానికి మీ రాశి చిత్రం మీద క్లిక్ చేయండి. రాశిఫలములను గోచార ఫలములు అని కూడా అంటారు, అంటే గ్రహాల యొక్క రాశి మార్పులు. చంద్రుడి నుండి ప్రతి గ్రహ గోచారం వివిధ రకాల ఫలితాన్ని ఇస్తుంది. గ్రహాలు నాల్గవ ఇల్లు, ఎనిమిదవ ఇల్లు, పన్నెండవ ఇల్లు లో సంచారం చేసేటప్పుడు చెడు ఫలితాలనిస్తాయి. అన్ని పాప గ్రహాలు తృతీయ, ఆరవ, పదకొండవ ఇంట్లో శుభ ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా పదకొండవ ఇల్లు లాభ స్థానంగా పిలువబడుతుంది, ఇది మన కోరికలను నెరవేరుస్తుంది మరియు సంపూర్ణ విజయాన్ని అందిస్తుంది. సాధారణంగా గోచారంలో ఒక గ్రహం నాలగవ ఇంట్లో సంచరించేటప్పుడు అధిక పనిభారం మరియు ఒత్తిడిని ఇస్తుంది. ఎనిమిదో ఇంటిలో సంచారం చేయడం వల్ల ప్రమాదాలు, నష్టాలు మరియు దొంగతనం, పన్నెండవ ఇంట సంచారం చేసే గ్రహాలు ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక నష్టాలను ఇస్తాయి. నవగ్రహాలు వివిధ భావాల్లో సంచరించేప్పుడు ఒక్కో గ్రహానికి ఒక్కో ఫలితం ఉంటుంది. చంద్రుడు 2 1/4 రోజుల్లో రాశి మారతాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు నెలకు ఒక రాశిలో పరివర్తన చెందుతారు. కుజుడు సుమారుగా 45 రోజుల పాటు ఒక రాశి మీద పరివర్తన చెందుతాడు. బృహస్పతి సంవత్సరానికి ఒక రాశిలో పరివర్తన చెందుతాడు. రాహుకేతువులు 18 నెలలపాటు రాశిలో పరివర్తన చెందుతారు. శని రెండున్నర సంవత్సరాలకు ఒక రాశిలో పరివర్తన చెందుతాడు.



June జూన్ 2024 లో గ్రహ గోచార వివరాలు.
ఈ జూన్ నెల ఒకటవ తేదీన కుజుడు మీనరాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు 12వ తేదీ వరకు వృషభ రాశిలో సంచరించి ఆ తర్వాత మిథున రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. బుధుడు ఈనెల 14వ తేదీన వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మిథున రాశిలో 29వ తేదీ వరకు సంచరించి ఆ తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. ఈనెల 15వ తేదీ వరకు సూర్యుడు వృషభ రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత తన సంచారాన్ని మిధున రాశిలో కొనసాగిస్తాడు. గురువు ఈ నెల అంతా సంచారాన్ని వృషభ రాశిలో కొనసాగిస్తాడు. శని కుంభరాశిలో, రాహువు మీనరాశిలో, మరియు కేతువు కన్యారాశిలో తమ సంచారాన్ని ఈ నెలంతా కొనసాగిస్తారు.

ఇక్కడ ఇవ్వబడుతున్న రాశి ఫలములు మీ చంద్రరాశి ఆధారంగా చేసుకుని రాసినవి. ఇవి పాశ్చాత్యపద్ధతిలో సూర్య రాశి ఆధారంగా రాసినవి కాదని గమనించగలరు. మీ చంద్రరాశి ఏదో తెలియకుంటే ఈ లింక్ ద్వారా మీ జనన వివరాలు ఇచ్చి మీ రాశి మరియు నక్షత్రం తెలుసుకోవచ్చు.
Please Note: All these predictions are based on planetary transits and Moon sign based predictions. These are just indicative only, not personalised predictions.