onlinejyotish.com free Vedic astrology portal

మకర రాశి - 2022 సంవత్సర రాశి ఫలములు


మకర రాశిఫలములు

2022 సంవత్సర రాశిఫలములు

Telugu Rashi Phalalu (Rasi phalamulu)

2022 Rashi phalaalu


గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2022 samvatsara Makara rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Makara Rashi in Telugu

Kanya rashi telugu year predictions

ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు (బో, జ, జి)
శ్రవణం 4 పాదాలు (జు, జే, జో, ఖ)
ధనిష్టా 1, 2 పాదాలు (గ, గి)

ఈ సంవత్సరం ఏప్రిల్ 13 న, బృహస్పతి మీన రాశిలోకి, 3వ ఇంటిలోకి, మరియు ఏప్రిల్ 12 న మేషరాశిలో, 4వ ఇంటిలోకి రాహువు మరియు తులారాశిలో, 10వ ఇంటిలో కేతువు ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 29 న, శని కుంభ రాశిలోకి, 2వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు మరియు జూలై 12 న, తిరోగమనం తర్వాత మకర రాశిలోకి, 1వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 21 వరకు అస్తంగతుడై ఉంటాడు. బృహస్పతి ఫిబ్రవరి 24 నుండి మార్చి 23 వరకు అస్తంగతుడై ఉంటాడు. అక్టోబర్ 30న కుజుడు వక్రగతుడు అవుతాడు మరియు జనవరి 13, 2023న మార్గి అవుతాడు. జూలై 29న బృహస్పతి వక్రగతుడుగా మారి నవంబర్‌ 24న మార్గీ అవుతాడు. డిసెంబర్ 19, 2021న శుక్రుడు వక్రగతుడుగా మారి, జనవరి 29, 2022న మార్గిగా మారతాడు. శని జూన్ 5న వక్రగతిని పొంది, అక్టోబర్ 23న మార్గి అవుతాడు.



2022 సంవత్సరం ఉద్యోగ జాతకం

మకర రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత కొంత సామాన్యంగా ఉంటుంది. మకర రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. పదోన్నతి కొరకు ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో వారు కోరుకున్న విధంగా పదోన్నతి లభిస్తుంది. ఆర్థికంగా కూడా ఈ సమయం అనుకూలిస్తుంది. శని దృష్టి మూడవ మరియు పదవ ఇంటిపై ఉండటంవల్ల వృత్తిలో అభివృద్ధితో పాటు పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. చిన్న చిన్న పనులు కూడా ఎక్కువ శ్రమతో చేయవలసి వస్తుంది. మీరు చేసే పనికి గుర్తింపు వచ్చినప్పటికీ ఆలస్యంగా చేయడం వలన ఆ గుర్తింపుకు విలువ లేకుండా పోతుంది. ఈ సమయంలో రాహు గోచారం కూడా ఐదవ ఇంటిలో సామాన్యం గా ఉండటం వలన మీ నిర్ణయాల్లో అలసత్వం కారణంగా అవకాశాలను వదులుకోవాల్సి వస్తుంది. ఏప్రిల్లో గురు మరియు రాహు గోచారం మారటం వలన వృత్తిలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో ఉన్న పై అధికారులు కాకుండా కొత్తవారు రావడం లేదా మీరు కొత్త ప్రదేశంలో పని చేయడం లేదా కొత్త ఉద్యోగం చేయడం వలన పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కొన్నిసార్లు విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వస్తుంది. ఈ సమయంలో ఇంటికి దూరంగా పని చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి జూలై మధ్యకాలంలో శని దృష్టి పదవ ఇంటిపై లేకపోవడం వలన వృత్తిలో కొంత ఒత్తిడి తగ్గినప్పటికీ అభివృద్ధి సామాన్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఎంత పని చేసినప్పటికీ సరైన గుర్తింపు లభించక పోవటం వలన అసహనానికి, నిరాశా నిస్పృహలకు లోనవుతారు. ఈ సమయంలో ఉద్యోగంలో మార్పు కొరకు కానీ, ఉద్యోగం చేసే ప్రదేశంలో మార్పు కొరకు కానీ ప్రయత్నం చేసినప్పటికీ సరైన ఫలితం లభించక పోవచ్చు. అయితే కేతువు గోచారం అనుకూలంగా ఉండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ స్నేహితులు మరియు శ్రేయోభిలాషుల సహాయంతో ఒత్తిడిని కొంత తగ్గించుకోగలుగుతారు. రాహు గోచారం ఐదవ ఇంటిలో ఉండటం వలన మీరు ఇచ్చే సలహాలు మీ కంటే ఎక్కువ ఇతరులకు ఉపయోగపడతాయి. వాటి వలన ఇతరులు లాభం పొందినప్పటికీ, ఆ కృతజ్ఞతలు వారు మీపై చూపించరు. ఏప్రిల్ నుంచి గురు దృష్టి పదకొండవ ఇంటిపై ఉండటం వలన వృత్తిలో కొంత అభివృద్ధిని చూస్తారు. ఈ సమయంలో లో ప్రయాణాలు అధికంగా అంతేకాకుండా వృత్తిలో మార్పు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే జూలై తర్వాత శని దృష్టి పదవి ఇంటిపై ఉండటం వలన వృత్తి పరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కుంటారు. మీరు చేసే పని నిజాయితీగా చేయడం, ఎవరి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగ కుండా ఉండటం వలన వృత్తిలో సమస్యలు వచ్చినప్పటికీ వాటిని విజయవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఏలినాటి శని సమయంలో వచ్చే ప్రతి సమస్య మీకు భవిష్యత్తులో వచ్చే విజయాలను ఇవ్వటానికి తప్ప మిమ్మల్ని నష్ట పెట్టడానికి కాదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సమయం అంతా కూడా మిమ్మల్ని మరింత నిపుణులుగా, శక్తివంతులుగా చేసి మీలో ఉన్న లోపాలను తొలగించేదిగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వచ్చే ప్రతి అడ్డంకిని సహనంతో, ధైర్యంతో ఎదుర్కొని ముందడుగు వేయడం మంచిది.



2022 సంవత్సరం ఆర్థిక జాతకం

ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఏప్రిల్ వరకు గురువు గోచారం రెండవ ఇంట ఉండటం వలన ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ధన స్థానంలో గురు గోచారం కారణంగా, ఉద్యోగ వ్యాపారాల ద్వారానే కాకుండా, వారసత్వ ఆస్తులు రావడం కానీ, గతం లో పెట్టుబడి పెట్టిన డబ్బులకు మంచి లాభాలు రావడం కానీ జరుగుతుంది. ఈ సమయంలో మీ కుటుంబ ఆదాయం కూడా పెరుగుతుంది. ఇల్లు కానీ, స్థిరాస్తి కానీ, లేదా వాహనం కానీ ఈ సమయంలో కొనుగోలు చేస్తారు. ఏప్రిల్ నుంచి జులై మధ్యలో శని గోచారం రెండవ ఇంట ఉండటం వలన ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా ఖర్చులు పెరగడమే కాకుండా, మీరు గతంలో తీసుకున్న అప్పులు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో శని దృష్టి లాభ స్థానం పై ఉండటం రావలసిన లాభాల్లో కానీ, ఆదాయంలో కానీ తగ్గుదల ఉంటుంది. అంతేకాకుండా రావాల్సిన డబ్బులు సమయానికి రాకుండా ఆలస్యంగా వస్తాయి. ఈ సమయంలో గురు దృష్టి కూడా లాభ స్థానం పై ఉండటం వలన శని ఇచ్చే చెడు ఫలితాలు కొంత తగ్గుతాయి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం కానీ, స్థిరాస్తులు కొనుగోలు చేయడం కానీ మంచిది కాదు. ఏప్రిల్ వరకు కేతు గోచారం కూడా అనుకూలంగా ఉండటం వలన ఆకస్మిక ధన లాభం కానీ, అనుకోని విధంగా డబ్బు రావడం కానీ జరుగుతుంది. జూలై నుంచి డిసెంబర్ మధ్యలో శని దృష్టి లాభ స్థానం పై ఉండక పోవడం వలన ఆదాయంలో కొంత పెరుగుదల చూస్తారు. అయితే ఈ సమయంలో విలాసాల కొరకు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సమయంలో మీరు చేసే దుబారా ఖర్చు భవిష్యత్తులో మీకు ఆర్థిక సమస్యలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అనవసరమైన వాటికి డబ్బు ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడటం మంచిది.

2022 సంవత్సరం కుటుంబ జాతకం

కుటుంబ పరంగా ఈ సంవత్సరం మకర రాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో గురువు గోచారం రెండవ ఇంట ఉండటం వలన కుటుంబంలో అభివృద్ధి జరుగుతుంది. సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి సంతానం కావడం కానీ, వివాహం గురించి ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో లో వివాహం కావటం కానీ జరుగుతుంది. మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మీ మాటకు, మీరు చేసే పనులకు విలువ, గౌరవం లభిస్తాయి. సమాజంలో మీరు ఒక ఉన్నత స్థాయికి ఈ సమయంలో చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే మీలో కీర్తి కాంక్షను తగ్గించుకొని చేసే పనులను నిజాయితీగా చేయడం మంచిది. ఏప్రిల్ నుంచి జులై మధ్యలో శని గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటిలో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు రావటం కానీ, మీరు మీ కుటుంబానికి దూరంగా ఉండవలసి రావటం కానీ జరగవచ్చు. మీ మిత్రుల నుంచి కానీ, కుటుంబ సభ్యుల నుంచి కానీ మీరు ఆశించిన సహాయం రాకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురవుతారు. అంతేకాక మీ మాటకు విలువ తగ్గడం కానీ, మీరు చెప్పే వాటిని మీ కుటుంబ సభ్యులు సరిగ్గా పాటించకపోవడం కానీ జరగవచ్చు. దాని వలన మీరు నిరుత్సాహానికి, అసహనానికి గురయ్యే అవకాశం ఉంటుంది. జూలై నుంచి శని గోచారం కుటుంబ స్థానంపై నుంచి లగ్నం పైకి మారటంతో కుటుంబంలో ఉన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆ సమయంలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మీ స్నేహితుల సహకారంతో తొలగించుకో గలుగుతారు. మీ తండ్రి గారి ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ సమయంలో నాలుగవ ఇంటిలో రాహువు గోచారం కారణంగా మీరు ఉద్యోగ రీత్యా కాని ఇతర కారణాల వల్ల కానీ ఇంటికి దూరంగా ఉండవలసి రావడం కానీ, ఇంటికి సంబంధించిన సమస్యలు ఏర్పడటం కానీ జరగవచ్చు. కేతువు గోచారం పదవ ఇంటిలో ఉండటం వల్ల మీరు చేసే పనులకు గుర్తింపు రావడం లేదన్న బాధకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయం లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ, యజ్ఞ, యాగాది క్రతువులు నిర్వహించడం కానీ చేస్తారు. అంతేకాకుండా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.



2022 సంవత్సరం ఆరోగ్య జాతకం

మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్యం మెరుగుగా ఉంటుంది. గతంలో వచ్చిన ఆరోగ్య సమస్యలు కొంత మేరకు తగ్గుతాయి. శని గోచారం ఉండటం వలన శారీరకంగా ఏదో ఒక సమస్యతో బాధపడే అవకాశం ఉన్నప్పటికీ, గురు గోచారం అనుకూలంగా ఉండటం ఈ సమస్యలు తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో రాహు గోచారం ఐదవ ఇంటిలో ఉండటం వలన మీ రోగ నిరోధక శక్తి తగ్గటం కానీ, మీరు తీసుకునే అది జాగ్రత్తలు మీకు ఆరోగ్య సమస్యలు తీసుకురావడం కానీ జరగవచ్చు. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో శని గోచారం రెండవ ఇంట్లో ఉండటం వలన ఆరోగ్య విషయాలు లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎముకలు, దంతాలు, చేతులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయితే గురు గోచారం లాభ స్థానంలో అనుకూలంగా ఉండటం వలన సరైన వైద్యం లభించి ఈ ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో రాహు గోచారం కొంత వ్యతిరేకంగా ఉండటం వలన మానసికంగా ఒత్తిడికి గురవడం, నిద్రలేమి ఎక్కువ ఉండటం, దాని కారణంగా జీర్ణ శక్తి తగ్గటం జరుగుతుంది. ఈ సమయంలో మానసిక ఒత్తిడి తగ్గటానికి, ఆరోగ్య సమస్యలు తగ్గటానికి సరైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండటం మంచిది. దీనితో పాటుగా శారీరక వ్యాయామాలు చేయడం వలన శని ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. జూలై నుంచి శని గోచారం తిరిగి జన్మరాశికి మారటం వలన ఆరోగ్య విషయంలో కొంత అనుకూలత ఏర్పడుతుంది. అయితే మానసికంగా మాత్రం ఏదో తెలియని బాధ, ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ ప్రభావం తగ్గటానికి మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యేలా చేసుకోవడం మంచిది. ఈ సమయంలో గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులు, మిత్రుల సహకారంతో మానసిక ఆరోగ్య సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంటుంది.

2022 సంవత్సరం వ్యాపారం మరియు స్వయం ఉపాధి

మకర రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఏప్రిల్ వరకు గురువు గోచారం అనుకూలంగా ఉన్నప్పటికీ సప్తమ స్థానంపై శని దృష్టి కారణంగా వ్యాపారంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది వ్యాపార అభివృద్ధికి ఏ రకమైన ఆటంకాలు కల్పించదు. ఈ సమయంలో వచ్చిన సమస్యలను మీరు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కాబట్టి వ్యాపార పరంగా వచ్చిన ఒడిదుడుకులను తట్టుకోగలుగుతారు. ఈ సమయంలో మీ వ్యాపారంలో న్యాయ సంబంధ లేదా భాగస్వామ్య సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీలైనంతవరకూ మీ శ్రమను నమ్ముకొని, నిజాయితీగా పని చేయడం వలన వ్యాపారంలో ఏర్పడ్డ సమస్యలను తొలగించుకోగలుగుతారు. ఏప్రిల్ నుంచి జులై మధ్యలో శని గోచారం రెండవ ఇంట ఉండటం, గురు దృష్టి ఏడవ మరియు పదకొండవ ఇంటి పై ఉండటం వలన వ్యాపారంలో మంచి అభివృద్ధి లభిస్తుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీరు చేపట్టే పనులు విజయం సాధిస్తారు. అయితే ఈ సమయంలో వ్యాపార సంబంధ ఖర్చులు గాని, పెట్టుబడులు కానీ ఎక్కువగా ఉంటాయి. వ్యాపార పరంగా ఏవైనా సంస్థలతో కానీ, ఆధ్యాత్మిక లేదా విద్యా కేంద్రాలతో కానీ భాగస్వామ్యం పెట్టుకోవడం కానీ వారి సహాయంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం గానీ జరుగుతుంది. ఈ సమయంలో వ్యాపార సంబంధ ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. జూలై నుంచి డిసెంబర్ మధ్యలో వ్యాపార పరంగా తిరిగి కొన్ని సమస్యలు రావటం కానీ లేదా వ్యాపారం మందకొడిగా సాగటం కానీ జరగవచ్చు. ఈ సమయంలో వ్యాపారంలో అభివృద్ధికి మీరు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. స్వయం ఉపాధి ద్వారా జీవనం కొనసాగిస్తున్న వారు కానీ, కళాకారులు కానీ ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు చూస్తారు. ఏప్రిల్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉండటం మంచి అవకాశాలు వచ్చి ఆర్థికంగా మెరుగైన స్థితిని పొందుతారు. అయితే ఈ సమయంలో ఎంతో కష్టపడినప్పటికీ అనుకున్న విధంగా పేరు రాకపోవడంతో కొంత నిరుత్సాహానికి లోనవుతారు. గుర్తింపు సంపాదించడం కొరకు, విశ్రాంతి లేకుండా కష్టపడతారు. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో శని గోచారం రెండవ ఇంట్లో ఉండటం వలన పరిస్థితుల్లో అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. మీకు అవకాశాలు రావడమే కాకుండా, మీరు పడిన శ్రమకి, మీ నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది. అవార్డులు, రివార్డులు అందుకుంటారు. జూలై తర్వాత శని గోచారం మారటంతో తిరిగి కొన్ని అడ్డంకులు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మంచి అవకాశాలు వచ్చినప్పటికీ మీరు వాటిని వదులుకొని తర్వాత బాధ పడతారు. ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.



2022 సంవత్సరం విద్యార్థులు మరియు వారి చదువు

మకర రాశిలో విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి చదువులో బాగా రాణిస్తారు. చదువుపై ఆసక్తి మరియు ఏకాగ్రత పెరుగుతుంది. వారి పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. ఈ సమయంలో రాహు గోచారం ఐదవ ఇంటిలో ఉండటం వలన పరీక్షల విషయంలో కొంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించే అవకాశం ఉంటుంది. అయితే సరైన సమయంలో అధ్యాపకుల సలహాలు, సూచనలు అందటం వలన నిర్లక్ష్య ధోరణి విడనాడి పరీక్షల్లో శ్రద్ధగా రాయగలుగుతారు. ఏప్రిల్ నుంచి గురు గోచారం మూడవ ఇంటిలో ఉండటం, నాలుగవ ఇంటిలో రాహు గోచారం చేయటం, జూలై వరకు శని దృష్టి నాలుగు ఇంటిపై ఉండటం వలన చదువు మీద శ్రద్ధ తగ్గడం కానీ, నిర్లక్ష్య ధోరణి ఏర్పడటం కానీ జరగవచ్చు. ఈ సమయంలో అహంకారానికి లోనవ్వకుండా, శ్రద్ధగా చదివినప్పుడు మాత్రమే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. గతంలో వచ్చిన పేరు, ప్రతిష్టలు మీరు పడిన కష్టానికి వచ్చిన ప్రతిఫలంగా గుర్తించినప్పుడే మీరు చదువు విషయంలో నిర్లక్ష్యాన్ని విడిచిపెట్ట గలుగుతారు. జూలై తరువాత శని తిరిగి జన్మరాశికి మారటంతో చదువు విషయంలో కొంత అభివృద్ధి సాధ్యమవుతుంది. పోటీ పరీక్షలు రాసే వారు ఈ సంవత్సరం ప్రథమార్థంలో అనుకూల ఫలితాన్ని పొందుతారు. ద్వితీయార్ధంలోగ్రహస్థితి సామాన్యం గా ఉండటం వలన కష్టపడితే కాని ఫలితం దక్కదు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని ఈ సంవత్సరం మీ శ్రమ నమ్ముకోవడం మంచిది. దానివల్ల మీరు అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతారు.

2022 సంవత్సరం గ్రహదోషములు - పరిహారములు

మకర రాశి వారు ఈ సంవత్సరం శనికి, గురువుకు, మరియు రాహువుకు పరిహారాలు ఆచరించడం మంచిది. ఈ సంవత్సరం ఈ మూడు గ్రహాల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి వీటికి పరిహారాలు చేయడం వలన అవి ఇచ్చే చెడు ఫలితాలు తగ్గే అవకాశం ఉంటుంది. శని గోచారం ఈ సంవత్సరమంతా బాగుండదు కనుక ప్రతిరోజు శని స్తోత్రం చదవడం కానీ, హనుమాన్ చాలీసా లేదా హనుమాన్ స్తోత్రం చదవడం కానీ మంచిది. ఇవే కాకుండా 19,000 సార్లు శని మంత్ర జపం చేయటం కానీ, శని గ్రహ శాంతి హోమం చేయడం మంచిది. శని మనం చేసే కష్టానికి సంతృప్తి చెందుతాడు కాబట్టి, శారీరకంగా కష్టపడటం అంటే పేదవారికి, వృద్ధులకు, వికలాంగులకు సేవ చేయడం అలాగే దానధర్మాలు చేయడం వలన శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి గురు గోచారం మూడవ ఇంటిలో మధ్యమంగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు గురు గ్రహ స్తోత్రం పారాయణం చేయటం కానీ, గురు చరిత్ర పారాయణం చేయడం కానీ లేదా ఇతర గురు సంబంధ స్తోత్రం పారాయణం చేయడం కానీ చేస్తే గురు సంతృప్తి చెందుతాడు కాబట్టి గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి రాహువు నాలుగవ ఇంటిలో ఇస్తాడు కాబట్టి ప్రతిరోజు రాహు స్తోత్ర పారాయణం కానీ, దుర్గా స్తోత్రం పారాయణం కానీ చేయడం మంచిది. ఇవే కాకుండా 18,000 సార్లు రాహు మంత్ర జపం చేయటం కానీ, లేదా రాహు గ్రహ శాంతి హోమం చేయటం కానీ మంచిది. మీ జాతకంలో పైన చెప్పిన గ్రహాల యొక్క దశ లేదా అంతర్దశలు ఈ సమయములో నడుస్తున్నట్లు అయితే వాటి ప్రభావము అధికంగా ఉంటుంది. పైన చెప్పిన పరిహారములు మీ శక్తి, భక్తి మరియు శ్రద్ధ మేరకు ఏ పరిహారం అయినా పాటించవచ్చు అంతేకానీ చెప్పిన పరిహారములు అన్ని పాటించమని చెప్పడం లేదు. ఈ గ్రహాల పరిహారాలు తో పాటుగా వీలైనంత వరకూ తోచిన విధంగా అవసరం ఉన్నవారికి సేవ చేయడం మంచిది.



రాజాది నవనాయక ఫలితములు

12 రాశుల ఆదాయ, వ్యయాలు

27 నక్షత్రాల నక్షత్రాల కందాయ ఫలములు

శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలములు

Aries
Mesha rashi,year 2026 rashi phal for ... rashi
Taurus
vrishabha rashi, year 2026 rashi phal
Gemini
Mithuna rashi, year 2026 rashi phal
Cancer
Karka rashi, year 2026 rashi phal
Leo
Simha rashi, year 2026 rashi phal
Virgo
Kanya rashi, year 2026 rashi phal
Libra
Tula rashi, year 2026 rashi phal
Scorpio
Vrishchika rashi, year 2026 rashi phal
Sagittarius
Dhanu rashi, year 2026 rashi phal
Capricorn
Makara rashi, year 2026 rashi phal
Aquarius
Kumbha rashi, year 2026 rashi phal
Pisces
Meena rashi, year 2026 rashi phal

 

Newborn Astrology

 

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Telugu.

 Read More
  
 

KP Horoscope

 

Free KP Janmakundali (Krishnamurthy paddhati Horoscope) with predictions in Telugu.

 Read More
  
 

Vedic Horoscope

 

Free Vedic Janmakundali (Horoscope) with predictions in Telugu. You can print/ email your birth chart.

 Read More
  
 

Vedic Horoscope

 

Free Vedic Janmakundali (Horoscope) with predictions in English. You can print/ email your birth chart.

Read More
  

Contribute to onlinejyotish.com

QR code image for Contribute to onlinejyotish.com
Contribute via UPI (For Indians)

People living in other countries, contribute via PayPal.

Why Contribute?

  • Support the Mission: Your contributions help us continue providing valuable Jyotish (Vedic Astrology) resources and services to seekers worldwide for free.
  • Maintain & Improve: We rely on contributions to cover website maintenance, development costs, and the creation of new content.
  • Show Appreciation: Your support shows us that you value the work we do and motivates us to keep going.
You can support onlinejyotish.com by sharing this page by clicking the social media share buttons below if you like our website and free astrology services. Thanks.