Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2021 samvatsara Mesha rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Mesha Rashi in Telugu

అశ్వని 1, 2, 3, 4, పాదములు (చూ, చే, చో, లా)
భరణి
1, 2, 3, 4 పాదములు (లీ, లూ, లే, లో)
కృత్తిక 1వ పాదము (ఆ)
ఈ సంవత్సరం బృహస్పతి మినహా మిగిలిన అన్ని ఇతర నెమ్మదిగా కదిలే గ్రహాలు ప్రస్తుతం తామున్న రాశులపై తమ సంచారాన్ని కొనసాగిస్తాయి. శని మకర రాశిలో పదవ ఇంటిలో, రెండవ ఇంటిలో, వృషభ రాశిలో రాహువు, వృశ్చిక రాశిలో కేతువు, అష్టమ స్థానంలో ఉంటారు. గురుడు ఏప్రిల్ 06న కుంభ రాశిలో పదకొండవ ఇంటిలో ప్రవేశిస్తాడు. వక్రగతి పొందిన తరువాత 14 సెప్టెంబర్ నాడు మకర రాశిలో పదవ ఇంటిలో తిరిగి తన సంచారాన్ని కొనసాగిస్తాడు. నవంబర్ 20న గురుడు మళ్లీ పదకొండవ ఇంటిలో ప్రవేశిస్తాడు.
గురుడు 10 వ మరియు 11వ ఇంటిలో సంచారం చేయడం వల్ల 10వ ఇల్లు పై నుంచి శని సంచారం వల్ల, కెరీర్ పరంగా ఈ సంవత్సరం చాలా ఆశాజనకంగా ఉంటుంది, 2వ ఇంటిలో రాహువు యొక్క సంచారం వల్ల, సంపదకు సంబంధించి కొన్ని అవాంతరాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి, అయితే మీ వృత్తి జీవితంలో స్థిరత్వం తప్పకుండా లభిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, పదవ ఇంటిలో బృహస్పతి మరియు శని సంచారం వల్ల, మీరు మీ పనిలో మంచి లాభాలు మరియు విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం జనవరి మరియు ఏప్రిల్ మధ్య సమయం ఒక సవాలుగా ఉంటుంది, ఎందుకంటే మీరు ఉద్యోగం లేదా స్థల మార్పుకు సంబంధించి సరైన నిర్ణయం తీసుకోలేకపోతారు. అనవసరమైన సవాళ్లు మరియు వాగ్ధానాలను పరిహరించడానికి ప్రయత్నించండి, ఎందుకంటే అవి మీ కెరీర్ ఎదుగుదలకు కొన్ని అడ్డంకులు కలిగించవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించే వారికి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ఈ సంవత్సరం మధ్యలో మీరు చేసే పనిలో పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు. మీతో పని చేసే వారు మీ సాయం కోరవచ్చు. మీ ఆలోచనలు మరియు మీ సృజనాత్మకత మీ పనిలో మరింత విజయం సాధించడానికి దోహదపడుతుంది. సంవత్సరం మధ్యలో, మీరు మీ పై అధికారుల నుంచి ఊహించని సాయం పొందుతారు. ఈ ఏడాది మధ్యలో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పదోన్నతితో పాటు గా మీరు కోరుకున్న ప్రదేశంలో ఉద్యోగంలో బదిలీ ఉండవచ్చు. మీ సహోద్యోగుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది.
ఆర్థికంగా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కొంత ఆర్థిక పరమైన ఒడిదుడుకులు ఉంటాయి. ద్వితీయ స్థానంలో రాహువు సంచారం ఆర్థిక స్థితి లో ఉన్న లోపము సూచిస్తుంది. ఎలాంటి రిస్క్ ఉన్న పనుల్లో పెట్టుబడి పెట్టవద్దు. గురు, శని కలిసి 4వ ఇంటిని వీక్షిస్తుండటం వలన భూములు, భవనాలు, వాహనాలు మొదలైనవి కొంటారు. గురుడు యొక్క దృష్టి వల్ల ఆర్థిక నష్టాలు తగ్గుతాయి. 12వ భావంపై శని దృష్టి కారణంగా అనవసర విషయాలకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి, మీ డబ్బును పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో, మీరు మెరుగైన ఆర్థిక లాభాలను పొందుతారు మరియు గతంలో పెట్టుబడుల కారణంగా నష్టపోయిన డబ్బు తిరిగి వస్తుంది.
సంవత్సరం ప్రారంభంలో కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు మరియు శని కలిసి నాలుగవ ఇంటిని వీక్షించటం వలన మీ కుటుంబంలో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మీ కుటుంబంలోని సభ్యులందరి నుంచి, తల్లిదండ్రులతో సహా మీకు పూర్తి సహకారం లభిస్తుంది. అయితే రాహువు మీ రెండవ ఇంటిలో సంచరించటం వలన మీ ప్రవర్తన మరియు మాట్లాడే విధానంలో మార్పు ఉంటుంది. కొన్నిసార్లు మీరు మొండిగా, మూర్ఖంగా వాదిస్తారు. దాని వలన కుటుంబ సభ్యులు కొంత బాధకు గురయ్యే అవకాశముంటుంది. మీ ప్రేమ సంబంధాల్లో విజయం సాధిస్తారు. రాహువు మీ ద్వితీయ భావంలో సంచరించటం వలన మీ కుటుంబంలోని ఒక వ్యక్తి ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాలు పడే అవకాశముంటుంది. మీ మాట తీరు కారణంగా కుటుంబంలో అభిప్రాయ భేదాలు కలిగే అవకాశమున్నది, అందువల్ల మీ మాట్లాడే విధానంపై నియంత్రణను కలిగి ఉండండి. మీ సంతానం పురోభివృద్ధిని సాధించగలుగుతారు. మీ మొదటి సంతానం గురించి సంతోషకరమైన వార్త మీకు అందుతుంది. విద్యారంగంలో గణనీయమైన మెరుగుదలకు బలమైన శుభసూచనలు న్నాయి. ఒకవేళ మీ బిడ్డ వివాహం చేసుకోదగ్గ వయస్సులో ఉన్నట్లయితే, అతడు/ఆమె వివాహం చేసుకోగలుగుతారు. ఐదవ ఇంటిలో గురుడు దృష్టి కారణంగా, కొత్తగా వివాహం చేసుకున్న జంట కు లేదా సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఈ సంవత్సరం గురువుయొక్క అనుకూల సంచారం కారణంగా ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు వ్యాధి రహిత జీవితాన్ని పొందడం మరియు పెంపొందించడం కొరకు ఆయుర్వేదం, యోగా, వ్యాయామం మరియు ధ్యానం మొదలైన వాటిని నేర్చుకోవడంలో నిమగ్నం అవుతారు. వీటితో పాటు మంచి ఆరోగ్యాన్ని కాపాడడానికి సరైన ఆహార అలవాట్లను పెంపొందించుకుంటారు. అయితే కేతువు యొక్క సంచారం ఈ సంవత్సరమంతా అష్టమ స్థానంలో ఉంటుంది కాబట్టి సంవత్సరం ఆరంభంలో చర్మ, మర్మావయవ సంబంధ ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంటుంది. గురు గోచారం ఏప్రిల్ నుంచి అనుకూలంగా ఉండటం వలన ఈ ఆరోగ్య సమస్యలు తొందరగానే తగ్గుముఖం పడతాయి.
విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. చదువు పట్ల ఆసక్తి పెరగటం, పోటీ తత్త్వం పెరటం వలన పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. చదువు పూర్తయ్య ఉద్యోగం కొరకు ఎదురుచూస్తున్న వారికి ఈ ఏడాది ఉపాధి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ ఏడాది మీరు నిస్సందేహంగా ఉద్యోగం చేస్తారు. ఉద్యోగాల కోసం తపన పడేవారు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ఈ సంవత్సరం అంతా కూడా రాహుకేతువుల గోచారం మీకు అనుకూలంగా ఉండదు. రాహువు గోచారం కారణంగా మీరు అహంకార పూరితంగా మాట్లాడటం, ఎవరినీ లెక్కచేయక పోవటం, కుటుంబం సభ్యులతో సరైన సంబంధాలు లేకుండా ఉండటం అలాగే ఆర్థికంగా కొంత ఒడిదుడుకులకు లోనవటం జరుగుతుంది. ఈ చెడు ప్రభావం తొలగించు కోవటానికి రాహువుకు పూజ చేయటం, రాహు జపం చేయటం లేదా దుర్గా పూజ చేయటం మంచిది. ఈ సంవత్సరమంతా కేతువు అష్టమ స్థానంలో సంచరిస్తాడు. దీని కారణంగా అనవసర విషయాలలో తలదూర్చి అవమానాలకు గురవటం, చెడు వ్యసనాలకు లోనవటం మొదలైన చెడు ఫలితాలుంటాయి. ఈ ప్రభావం తగ్గించుకోవటానికి కేతువుకు పరిహారాలు చేయటం మంచిది. కేతు సంబంధ స్తోత్రాలు చదవటం, కేతు జపం చేయటం, లేదా గణపతి ఆరాధన చేయటం మంచిది.
Detailed Horoscope (Telugu Jatakam) in Telugu with predictions and remedies.
Read MoreFree KP Janmakundali (Krishnamurthy paddhati Horoscope) with predictions in Telugu.
Read MoreKnow your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in English.
Read More
People living in other countries, contribute via PayPal.