OnlineJyotish.com

మిథునరాశి మాసఫలములు - డిశంబర్ (December) 2020

మిథునరాశి డిశంబర్ (December) 2020 రాశిఫలములు

వైదిక జ్యోతిషం ఆధారంగా నెలవారీ మిథునరాశి జాతకం

డిశంబర్ (December) మాసంలో మిథున రాశి వారికి జాతక ఫలాలు - ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థికస్థితి, కుటుంబం మరియు వ్యాపారం

Mithuna Rashi డిశంబర్ (December) 2020

 రాశిఫలములుమిథున రాశి, రాశి చక్రంలోని మూడవ రాశి. ఇది రాశి చక్రంయొక్క 60-90 వ డిగ్రీలను కలిగి ఉంటుంది. మృగశిర నక్షత్ర (3, 4 పాదములు), ఆరుద్ర నక్షత్ర (4 పాదములు), పునర్వసు నక్షత్ర (1, 2, 3 పాదములు) కింద జన్మించిన వారు మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు.

ఈ నెలలో మిశ్రమ ఫలితం ఉంటుంది. మొదటి పదిహేను రోజులు మీకు మంచి గా ఉంటుంది, రెండో పదిహేను రోజులు చాలా ఒత్తిడి ఉంటుంది.
ఈ నెలలో పని వారీగా మరిన్ని సవాళ్లు ఉంటాయి, ఎందుకంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మరియు మీ పనికి సంబంధించి ఎవరూ కూడా మద్దతు అందించరు. పదవిలో లేదా స్థానం లో కొంత మార్పు ఉంటుంది మరియు ఒక ప్రయాణం కూడా ఉండే అవకాశముంటుంది. కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించండి మరియు ఎవరిపైనా ఆధారపడవద్దు, ఎందుకంటే సరైన మద్దతు ఉండదు. మీ సహోద్యోగులు మీ పై అధికారులకు మీ గురించి చెడుగా చెప్పటం లేదా పుకార్లు లేపటం చేయవచ్చు. కాబట్టి మీ పై అధికారులను లేదా మీ సహోద్యోగులను గుడ్డిగా నమ్మవద్దని సూచించటమైనది. మీ పై అధికారులతో వాదించటం చేయకండి, అది మీకు చెడు చేయవచ్చు. నిరాశా, నిస్పృహల కారణంగా మీకు ఎదుటువారికి చెడు చేయాలి అనే ఆలోచనలు రావచ్చు. వీలైనంత వరకు ఓపికగా ఉండటం మంచిది. మీ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉ౦డ౦డి.
ఈ నెల ఆరోగ్యం పరంగా సామాన్యంగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు మరియు రక్త సంబంధిత సమస్యలకు సంబంధించి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంటుంది. మీ ఆహారపు అలవాట్లవిషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి తీవ్రమైన సంక్లిష్టతలు తలెత్తకుండా ఉండాలంటే మీ ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ తీసుకోవటం మంచిది.
ఆర్థికంగా ఈ నెల మీ సంపాదన లో పెరుగుదల కనిపిస్తుంది. ఒకవేళ మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని అనుకున్నట్లయితే, మొదటి రెండు వారాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించడం మంచిది. ఖర్టులు కొంతవరకు అదుపులో ఉంటాయి.
కుటుంబ జీవితం బాగుంటుంది. మీ జీవిత భాగస్వామికి మంచి ఆదాయం లేదా కొంత ఆర్థిక లాభాలు ఉంటాయి. ఈ మాసంలో మీ ఇంట్లో శుభకార్యం జరగటం కానీ, లేదా మీ కుటుంబ సబ్యులతో కలిసి శుభకార్యానికి వెళ్లటం జరగవచ్చు.
వ్యాపారంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితం ఉంటుంది. మొదటి రెండు వారాల్లో మీరు మెరుగైన వ్యాపారం మరియు మంచి రిటర్న్ లను చూడవచ్చు. ఈ నెలలో చివరి రెండు వారాల్లో మీరు కాస్తంత నెమ్మదిగా వ్యాపారం మరియు తక్కువ ఆదాయం చూడవచ్చు.
ఈ నెల ప్రథమార్ధం లో విద్యార్థులకు మిశ్రమ ఫలితం ఉంటుంది, ద్వితీయార్ధంలో బద్ధకం మరియు ఏకాగ్రత లోపించడం జరుగుతుంది. మీ పరీక్షల్లో తక్కువ ఫలితాలు రావడానికి దారితీయవచ్చు కనుక, మీ చదువును వాయిదా వేయవద్దు.


Click here for November 2026 Rashiphal in English

Aries
Mesha rashi,November 2026 rashi phal for ... rashi
Taurus
vrishabha rashi, November 2026 rashi phal
Gemini
Mithuna rashi, November 2026 rashi phal
Cancer
Karka rashi, November 2026 rashi phal
Leo
Simha rashi, November 2026 rashi phal
Virgo
Kanya rashi, November 2026 rashi phal
Libra
Tula rashi, November 2026 rashi phal
Scorpio
Vrishchika rashi, November 2026 rashi phal
Sagittarius
Dhanu rashi, November 2026 rashi phal
Capricorn
Makara rashi, November 2026 rashi phal
Aquarius
Kumbha rashi, November 2026 rashi phal
Pisces
Meena rashi, November 2026 rashi phal
Please Note: All these predictions are based on planetary transits and Moon sign based predictions. These are just indicative only, not personalised predictions.