వృషభరాశి డిశంబర్ (December) 2020 రాశిఫలములు
వైదిక జ్యోతిషం ఆధారంగా నెలవారీ వృషభరాశి జాతకం
డిశంబర్ (December) మాసం లో వృషభ రాశి వారి గోచారఫలములు ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థికస్థితి, కుటుంబం మరియు వ్యాపారం
వృషభం రాశి చక్రంలో రెండవ రాశి. ఇది రాశిచక్రం యొక్క 30-60వ డిగ్రీలను కలిగి ఉంటుంది. కృత్తిక (2, 3, 4 పాదములు), రోహిణి (4 పాదములు), మృగశిర (1, 2 పాదములు) కింద జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందకు వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు.
ఈ నెల మీకు సామాన్యంగా ఉంటుంది. అనేక అడ్డంకులు, టెన్షన్ మరియు వైఫల్యాలు ఉంటాయి. ఈ నెల అంతా మీరు నిరాశ మరియు అసహనానికి లోనవుతారు. కెరీర్ లో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. మీకు ఎక్కువ పనిభారం ఉండవచ్చు, మరియు ఈ నెలలో మీరు కొంత సమయం పాటు వేరే చోట పనిచేయాల్సి రావొచ్చు. ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడం కొరకు మీ పై అధికారులు మరియు ఇతర సహోద్యోగులతో సరైన సంబంధాలను కలిగి ఉండండి. అలాగే ఈ సమస్యలను అధిగమించడానికి సూర్య, శని గ్రహాలకు కొన్ని రెమెడీస్ ను చేయండి.
ఆర్థికంగా ఈ నెల సామాన్యంగా ఉంటుంది. చివరి రెండు వారాల్లో మీరు భారీ ఖర్చులను ఎదుర్కొనవచ్చు. మీ కొనుగోళ్లు లేదా కుటుంబ సభ్యుల కొరకు మీరు డబ్బును ఖర్చు చేయవచ్చు. అనవసర ఖర్చులను నివారించడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా షేర్ మార్కెట్ లో మీ లాభాలు నష్టాలుగా మారవచ్చు. ఆర్థిక విషయాలకు సంబంధించి వేగంగా లేదా దుడుకైన నిర్ణయాలు తీసుకోవద్దు.
ఈ నెల కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు ఉంటాయి. కాబట్టి, మీరు ఏదైనా వాగ్దానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో మీ జీవిత భాగస్వామితో మీరు మంచిగా ఉండకపోవచ్చు, చిన్న చిన్న విషయాలమీద మీరు పోరాడుతూనే ఉంటారు. మీ సంబంధాల్లో సామరస్యం మరియు పరస్పర అవగాహన లోపిస్తుంది. బంధుమిత్రులతో సరైన సంబంధాలు ఉండక పోవటం లేదా వారితో గొడవలు పెట్టుకోవటె చేయవచ్చు. మీ అహం తగ్గించడానికి ప్రయత్నించండి; ఇది మీ సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుంది.
ఈ నెల ఆరోగ్యం పరంగా సామాన్యంగా ఉంటుంది. మీరు జలుబు మరియు వేడి కి సంబంధించిన సమస్యలతో బాధించబడవచ్చు. మీరు రక్తానికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు. అధిక వేడి లేదా పిత్తకారణంగా వచ్చే వ్యాధులతో కూడా మీరు బాధించబడవచ్చు. మంచి ఆరోగ్యం కోసం సరైన ఆహారం, విశ్రాంతి తీసుకోవడం మంచిది. సూర్య, శని కి ఉన్న రెమెడీస్ మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి.
వ్యాపారంలో ఉన్న వారు ఈ నెల పెట్టుబడులకు, మీ వ్యాపారానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఈ నెలలో భాగస్వామ్య వ్యాపారంతో వెళ్లవద్దు. మీ వ్యాపార భాగస్వాములు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు, దీని ఫలితంగా మీరు ద్రవ్యపరమైన నష్టాలను ఎదుర్కొంటారు.
ఈ నెల ద్వితీయార్థంలో విద్యార్థులకు చదువులో మంచి అభివృద్ధి ఉంటుంది. అయితే మీరు సోమరితనానికి లోనయి, చదువువాయిదా వేయవద్దని సలహా ఇవ్వబడుతోంది. దీని వల్ల పరీక్షలలో తక్కువ మార్కులు సాధించే అవకాశముంటుంది.
Aries  |
Taurus
 |
Gemini  |
Cancer  |
Leo  |
Virgo
|
Libra  |
Scorpio  |
Sagittarius  |
Capricorn  |
Aquarius
|
Pisces
|
Please Note: All these predictions are based on planetary transits and Moon sign based predictions. These are just indicative only, not personalised predictions.