![]() |
|
|
|
|
|
ఆదాయం: 2 |
వ్యయం: 8 |
|
రాజపూజ్యం: 7 |
అవమానం: 3 |
|
గురువు మే 2 వరకు 10 వ స్థానంలో మే 2 నుంచి, నవంబర్ 1 వరకు 11వ స్థానంలో, తిరిగి నవంబర్ 1 నుంచి డిశంబర్ 6 వరకు 10వ స్థానంలో తిరిగి డిశంబర్ 6నుంచి వత్సరాంతం వరకు 11వ స్థానంలో సంచరిస్తాడు. శని ఈ సంవత్సరమంతా 5వ ఇంటిలో, రాహువు 8వ ఇంటిలో, కేతువు 2వ ఇంటిలో సంచరిస్తారు. గురువు మే వరకు 10వ ఇంటిలో సంచరించటం వలన ఈ సమయం మీ జీవితములో కుట్రల్ని తెస్తుంది. మీరు చెడ్డ తనముతో ఆలోచిస్తారు. కొన్ని పనులు పూర్తి కానందున మీకు అసహనముగా ప్రవర్తిస్తారు. శాంతిగా ఉండుటకు ప్రయత్నించాలి, లేదా అసంతృప్తి మిమ్మల్ని వేధిస్తుంది.. ఇంట్లో పెద్ద వారితో, ఉద్యోగములో పై అధికారులతోను వాదనలకు దిగకుండా ఉండుటకు ప్రయత్నించాలి. జాగ్రత్తగా లేనిచో మీ పదవి పోగొట్టుకొని, గౌరవాన్ని కూడా పోగొట్టుకొని, ఇష్టము లేని దూర ప్రాంతాలకు బదలీ అవుతారు. ధనమును, ఆస్తులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. శారీరక శ్రద్ధ అవసరము, పిల్లల ఆరోగ్యభంగము, కండ్ల జబ్బులు, మరియు గొంతు సంబంధ అనారోగ్యాలకు గురి అయ్యే అవకాశముంటుంది. మే నుంచి నవంబర్ వరకు 11వ ఇంటిలో గురు సంచారం కారణంగా ఈ సమయములో ఉద్యోగములో ఉన్నత పదవి, వ్యాపారములో లాభము, ఉన్నత స్థాయి లభిస్తాయి. సంఘములో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి సమయము, శారీరకముగా, మానసికముగా చక్కగా ఉండి, అందరు మిమ్మల్ని గుర్తించే విధముగా ప్రవర్తిస్తారు. స్నేహితుల నుండి, అయిన వారి నుండి లాభము, శత్రు దైవ కార్యముల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఎల్లప్పుడు దైవ చింతన చేయుట వలన శక్తి లభిస్తుంది. పెళ్లికాని వారికి వివాహము, వివాహితులకు సంతాన యోగ్యము, కొందరికి అన్యస్త్రీతో శృంగారము సంభవించును. ఆర్థికముగా బాగుండి, స్థలము, ఆభరణాలు, వాహనముల లాభము మొ. ఫలితాలుంటాయి. శని 5వ స్థానంలో సంవత్సరమంతా సంచరిస్తాడు. ఈ కారణంగా ఈ సమయం మానసిక బాధను కలిగించును, కారణము లేకనే కలహములు, బంధు మితృత, సజ్జనులతో విరోధములు, అన్య స్త్రీ పరిచయము, దుడుకుగా వ్యవహరించుట వలన అపకీర్తి సంభవించుట మొదలైన ఫలితాలుంటాయి. ఈ సమయంలో ఫనిలో శ్రద్ధ అవసరం. కొత్తనిర్ణయాలు తీసుకునే టప్పుడు జాగ్రత్త అవసరం. షేర్ మార్కెట్ మరియు స్పక్యలేషన్ సంబంధ వ్యాపారాలు అనుకూలించవు. కొత్తపనులు చేపట్టిన అనుకున్న ఫలితములు సాధించలేరు. సొంత ఆరోగ్యము మరియు భార్య, పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ సంవత్సరం రాహువు మీ చంద్ర రాశికి అష్టమ స్థానంలో సంచరించటం వలన ఈ సమయం ఆరోగ్యానికి హానికరమైనది. ఆరోగ్యముపై ప్రత్యేక శ్రద్ధ అవసరము. అంటు రోగములు, శృంగార రోగములు వచ్చు అవకాశమున్నవి. భీతి, ఆరోగ్య భంగము, ఎవరైతే 'మారక' దశలో వారి జన్మరాశిలో వెళ్తారో వారు కోరి ప్రమాదములు తెచ్చుకొనగలరు. వృత్తి వ్యవహారములలో చెడ్డగా ప్రవర్తించిన, లంచము తీసుకొన్న జైలు శిక్ష అనుభవించే అవకాశమున్నది. అపవాదములు కలుగవచ్చును. శత్రువుల వలన జాగ్రత్తగా ఉండవలెను. వారు మీకు వెన్నుపోటు పొడిచెదరు. స్థిరాస్థి, ఆభరణాల రక్షణ అవసరము. ఆర్థిక రంగములో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం కేతువు రెండవ ఇంటిలో సంచరించటం వలన ఈ కాలములో ధన నష్టము సంభవించవచ్చును. ఖర్చులు విపరీతముగా పెరుగును. ఇంట్లో దొంగతనము కూడా జరుగవచ్చును. ఋణములు చేయుట మంచిది కాదు. చంద్రుని భము చేత మీకు ఆరోగ్య భంగము కలుగును. మనశ్శాంతి కరువగును. కనులపై శ్రద్ధ వహించాలి. అగ్ని ప్రమాదాలకు దూరముగా ఉండవలెను. వైవాహిక జీవితములో భాగస్వామితో గొడవపడతారు. దీని వలన అత్తవారితో చెడ్డగా ప్రవర్తిస్తారు. స్థాన చలనము వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనవసర విషయాలలో తలదూర్చి, నష్టాలను కొని తెచ్చుకుంటారు. |
|

