![]() |
|
|
|
|
|
ఆదాయం: 8 |
వ్యయం: 14 |
|
రాజపూజ్యం: 4 |
అవమానం: 5 |
|
గురువు మే 2 వరకు 4 వ స్థానంలో మే 2 నుంచి, నవంబర్ 1 వరకు 5వ స్థానంలో, తిరిగి నవంబర్ 1 నుంచి డిశంబర్ 6 వరకు 4వ స్థానంలో తిరిగి డిశంబర్ 6నుంచి వత్సరాంతం వరకు 5వ స్థానంలో సంచరిస్తాడు. శని ఈ సంవత్సరమంతా 11వ ఇంటిలో, రాహువు 2వ ఇంటిలో, కేతువు 8వ ఇంటిలో సంచరిస్తారు. మే వరకు గురువు 4వ స్థానంలో సంచరించటం కారణంగా ఈ సమయం మీకు ఆందోళనను కలిగిస్తుంది. వృత్తిలో కష్టించి పనిచేయవలసి వస్తుంది. ప్రమోషన్లు అనుకున్న సమయములో రావు. అనవసరపు విషయాలలో/స్థిరాస్థి కొనుగోలు విషయాలలో తల దూర్చరాదు. శత్రువులకు దూరముగా ఉండవలెను. అయిన వారితోను, స్నేహితులతోను మంచిగా మసలుకొనవలెను. బాధలో ఉన్న వారిని పరామర్శిస్తారు. ఆర్థికముగా కలసి రాని కాలము. అనవసరపు ఖర్చులు, ప్రయాణాలు చేయరాదు. మీ ఆరోగ్యము, తల్లి ఆరోగ్యము పై శ్రద్ధ చూపగలరు. ఈ సమయాలలో నిరుత్సాహముగాను, నీరసముగాను ఉందురు. ఈ సమయములలో జంతువులకు, ప్రయాణములకు దూరముగా ఉండవలెను. లేనిచో ప్రమాదములకు గురి కావలసి వస్తుంది. సంఘములో అందరితోను ఉన్నతంగా ప్రవర్తించాలి. లేనిచో మీకు అందరి వలన ఎదురు తనము లభిస్తుంది. అందరి వలన మాటలు పడతారు, మనస్తాపము పొందుతారు. మే నుంచి గురువు 5వ ఇంటిలో సంచరించటం వలన ఈ సమయము మీకు ఆనందమును, జయమును కలిగిస్తుంది. కార్యసిద్ధి లభించి, పనిలో మరింత నిమగ్నలు అవుతారు. చేయు వృత్తి వ్యవహారములలో మంచి ఫలితములు లభించి, గౌరవములు పొంది మరిన్ని మంచి అవకాశములు, లాభమును గడిస్తారు. విద్యార్థులకు మంచి కాలము, మంచి శిక్షణ లభించి, అనుకున్నవి సాధిస్తారు. ఆర్థికముగా ఇంటా, బయటా బాగుగా ఉంటుంది. పశువులను, ఇంటిని, వస్తువులను, ఆభరణములను, వస్రల్తలను కొనుగోలు చేస్తారు. పెళ్లికాని వారికి, మంచి సంబంధము లభించి, వివాహ యోగ్యము కలదు. వివాహితులకు సంతాన ప్రాప్తి, మీ ప్రవర్తన ఇంట్లోని వారితో చక్కగా ఉండి, లాభము పొందువారు, ఇంట్లో సేవకులను పెడతారు, గృహమునందు శుభకార్యములు మీరు నిర్వహిస్తారు. సంఘములో మంచిపేరు, ఉన్నత వ్యక్తుల పరిచయము ద్వారా లబ్ది పొందుతారు, చలాకీగా వ్యవహరించి, అన్ని విషయాలలోను విజయము సాధిస్తారు. మంచి సమయమును గడుపుతారు. సంఘములో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, మనశ్శాంతితో ఉంటారు. శని సంవత్సరమంతా 11వ ఇంటిలో సంచరించటం వలన ఈ దశలో మంచి మార్పులువచ్చును. ఆర్థికముగా మంచి కాలము. అనుకోని ధన లాభము, దీనిచే మరిన్ని మంచి అవకాశాలు సంభవించును. స్థిరాస్థి కొనగలరు. ఏపని తలపెట్టినా విజయం సాధిస్తారు. వర్తకులు మంచి లాభమును గడించెదరు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు లభించును. పై చదువులకు ఉన్నత స్థానము విపరీతమైన ఉద్రేకము కలుగును. సంఘములో మంచి పేరు, గౌరవ మర్యాదలు పెరుగును. సంఘములో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్మానములు పొందుతారు. అవివాహతులకు వివాహయోగం. చాలా కాలంగా పూర్తికాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. మీ పనివారు, సహోద్యోగులు మీకు పూర్తి సహకారం అందిస్తారు. ఆరోగ్యం బాగవుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. రాహువు సంవత్సరమంతా 2వ ఇంటిలో సంచరించటం వలన ఈ దశలో ఆర్థికముగా, శారీరకముగా, సంఘపరముగా ఇబ్బందులు కలుగవచ్చును. మితముగా ఖర్చు చేయుట మంచిది. అనుకోని ఖర్చులు, దొంగతనము జరగవచ్చును. శరీరముపై జాగ్రత్త అవసరము, అకాల భోజనము, బయట భోజనము చేయుట పనికి రాదు. కోర్టు కేసులు కలసి రావు. బంధు వర్గము వారితో విరోధములు, వాదోపవాదములు పనికి రావు. జీవిత భాగస్వామితో కూడా విరోధము సంభవించును. చెడు వ్యసనములకు లోనగుదురు. కేతువు సంవత్సరమంతా అష్టమంలో సంచరించటం కారణంగా మీరు మనశ్శాంతి కోల్పోతారు. గృహమునందు జరిగిన ఒక చెడ్డపని మిమ్మల్ని బాదలకు గురి చేస్తుంది.. మితముగా ఖర్చు పెట్టవలెను. చెడు పనులకు దూరముగా ఉండాలి. లేదా మీపై తగిన దండన జరగవచ్చును. సంకుచిత బుద్ధితో పనిచేయుట వలన సంఘములో అపకీర్తి పొందుతారు. అయితే చంద్రగ్రహ ప్రభావముచే మీలో కొంతమందికి మంచి కాలము మరియు మంచి జీవితమును గడుపుతారు. పుణ్యకార్యములు చేయుటలో, మంచి పదార్థములు భుజించుటలో మీ కోరిక పెరుగును. |
|

వృశ్చిక
రాశి: