![]() |
|
|
|
|
|
ఆదాయం: 2 |
వ్యయం: 8 |
|
రాజపూజ్యం: 1 |
అవమానం: 5 |
|
గురువు మే 2 వరకు 5 వ స్థానంలో మే 2 నుంచి, నవంబర్ 1 వరకు 6వ స్థానంలో, తిరిగి నవంబర్ 1 నుంచి డిశంబర్ 6 వరకు 5వ స్థానంలో తిరిగి డిశంబర్ 6నుంచి వత్సరాంతం వరకు 6వ స్థానంలో సంచరిస్తాడు. శని ఈ సంవత్సరమంతా 12వ ఇంటిలో, రాహువు 3వ ఇంటిలో, కేతువు 9వ ఇంటిలో సంచరిస్తారు. మే వరకు గురువు 5వ ఇంటిలో సంచరించటం వలన ఈ సమయము మీకు ఆనందమును, జయమును కలిగిస్తుంది. కార్యసిద్ధి లభించి, పనిలో మరింత నిమగ్నలు అవుతారు. చేయు వృత్తి వ్యవహారములలో మంచి ఫలితములు లభించి, గౌరవములు పొంది మరిన్ని మంచి అవకాశములు, లాభమును గడిస్తారు. విద్యార్థులకు మంచి కాలము, మంచి శిక్షణ లభించి, అనుకున్నవి సాధిస్తారు. ఆర్థికముగా ఇంటా, బయటా బాగుగా ఉంటుంది. పశువులను, ఇంటిని, వస్తువులను, ఆభరణములను, వస్రల్తలను కొనుగోలు చేస్తారు. పెళ్లికాని వారికి, మంచి సంబంధము లభించి, వివాహ యోగ్యము కలదు. వివాహితులకు సంతాన ప్రాప్తి, మీ ప్రవర్తన ఇంట్లోని వారితో చక్కగా ఉండి, లాభము పొందువారు, ఇంట్లో సేవకులను పెడతారు, గృహమునందు శుభకార్యములు మీరు నిర్వహిస్తారు. సంఘములో మంచిపేరు, ఉన్నత వ్యక్తుల పరిచయము ద్వారా లబ్ది పొందుతారు, చలాకీగా వ్యవహరించి, అన్ని విషయాలలోను విజయము సాధిస్తారు. మంచి సమయమును గడుపుతారు. సంఘములో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, మనశ్శాంతితో ఉంటారు. గురువు మే నుంచి 6వ ఇంటిలో సంచరించటం కారణంగా ఈ సమయములో మీ జీవితములో చాలా చిక్కులు వచ్చును. ఇంటా, బయటా చెడ్డగా వ్యవహరించుట వలన శత్రువులు ఎక్కువ అవుతారు. మీరు అందరికి శత్రువుగా మారతారు. మీ శత్రువులు మిమ్మల్ని మరిన్ని కుట్రలకు గురి చేయగలరు. కావున, జాగ్రత్త అవసరము. ఆరోగ్యముపై శ్రద్ధ అవసరము, సంతోషముగా లేక అలసిపోతారు. సరైన ఔషధ సేవ అవసరము. పనియందు జాగ్రత్త అవసరము. లేనిచో ధనము, స్థిరాస్థి కోల్పోవుదురు. దొంగతనము, అగ్ని ప్రమాదము, ప్రభుత్వముచేఏ తిరుగబాటు, మొధగునవి చేయు వృత్తి వ్యవహారములలో జరుగును. ఉద్యోగులు, పైఅధికారులతోను, సహ ఉద్యోగులతోను కలసి మెలసి మెలగాలి. కొత్త సనులను వాయిదా వేయాలి. జీవిత భాగస్వామితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరితోను తగువులు తెచ్చుకోకుండా అనవసరపు విషయాలలో తలదూర్చకుండా మసలుకోవాలి. శని సంవత్సరమంతా 12వ ఇంటిలో సంచరించటం కారణంగా ఈ దశలో ధన నష్టము, ఆర్థిక పరమైన ఇబ్బందులు, అనవసరమైన ఖర్చులు చేయుదురు. వ్యవసాయదార్లు ప్రత్యేకమైన శ్రద్ధ చూపవలెను. శత్రువుల వలన ధన నష్టము సంభవించవచ్చును. ధనమును మితముగా ఖర్చుచేయవలెను. ఆరోగ్య శ్రద్శ అవసరము, భార్యా, పిల్ల్లల ఆరోగ్యముపై శ్రద్ధ వహించాలి. కాళ్లు, ఎముకల సంబంధ ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశముంది. అనవసర ప్రయాణాల కారణంగా ధనవ్యయం, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. సహోద్యోగులతో అనవసర వివాదాలు, మనస్పర్దలు ఏర్పడే అవకాశమున్నది. రాహువు 3వ ఇంటిలో సంచరించటం కారణంగా ఈ సమయం చెప్పుకోదగ్గ మార్పులు తెచ్చును. ఆర్థికముగా మంచికాలము. ధ వృత్తి వ్యవహారములు కలసివచ్చును. ఆగిపోయిన కార్యములు పూర్తి చేస్తారు. కార్యసిద్ధి, సహచరులు, పై అధికారుల సహకారము లభించును. మీ పనిని అందరు గుర్తిస్తారు. ఆరోగ్యదాయకరమైన దశ. సంఘములో ఉన్నత స్థాయికి చేరుకోగలరు. కీర్తి పెరుగును. గృహమునందు సుఖశాంతులు, మంచి మార్పులు, మంచి భోజనము, ఇంటా బయట అందరితోను మంచిగా ఉందురు. మీ వృత్తి వ్యవహారములలో సోదరవర్గము సహాయము చేయుదురు. అన్య స్త్రీతో సంబంధము, పెళ్లైన వారికి సంతాన భాగ్యము కలుగవచ్చును. కేతువు 9వ ఇంటిలో సంచరించటం కారణంగా ఈ దశలో ఆరోగ్యభంగము, మనశ్శాంతి లేకుండుట జరుగును. సంపాదించిన ధనమును లాటరీలకు ఖర్చు చేయుట వలన ధన నష్టము కలుగును. ధన నష్టము చేసి కుట్రలకు గురి కాగలరు. జాతి విరుద్థమైన పనులు చేయుదురు. సోదర వర్గముతో విరోధములు పనికి రావు. స్నేహితులతోను, అయిన వారితోను మంచిగా ప్రవర్తించవలెను. లేనిచో వారు మీకు దూరము కాగలరు. ఈ సమయములో మీరు విదేశీ ప్రయాణములు లేదా ఎత్తైన ప్రదేశాలకు వెళ్తారు. మీరు వృత్తి వ్యవహారములలో శత్రువులచే మరియు విరోదలులచే నష్టాన్ని చవి చూస్తారు. |
|

