![]() |
|
|
|
|
|
ఆదాయం: 2 |
వ్యయం: 14 |
|
రాజపూజ్యం: 2 |
అవమానం: 2 |
|
గురువు మే 2 వరకు 7 వ స్థానంలో మే 2 నుంచి, నవంబర్ 1 వరకు 8వ స్థానంలో, తిరిగి నవంబర్ 1 నుంచి డిశంబర్ 6 వరకు 7వ స్థానంలో తిరిగి డిశంబర్ 6నుంచి వత్సరాంతం వరకు 8వ స్థానంలో సంచరిస్తాడు. శని ఈ సంవత్సరమంతా 2వ ఇంటిలో, రాహువు 5వ ఇంటిలో, కేతువు 11వ ఇంటిలో సంచరిస్తారు. గురువు మే వరకు 7వ ఇంటిలో సంచారం కారణంగా ఈ సమయం మీ జీవితములో మంచి రోజుల్ని తెస్తుంది. శారీరక సౌఖ్యము, వస్తులాభము, మంచి పదారాœలు బలుజించుదురు, ఆస్థి కొనుగోలు, విశ్రాంతిగా ఉండుట మరియు పై అధికారుల వలన గౌరవము పొందుట వంటివి సంభవము. సంఘములో కూడా మీకు ఉన్నతమైన కాలము, సజ్జనులతో సహవాసము, తద్వారా లబ్ది పొందుదురు. మీ వాక్కు చాతుర్యముతో మరియు చలాకీగా వ్యవహరించుట వలన అందరిని ఆకట్టుకొందురు. ఈ సమయములో పుణ్యక్షేత్ర సందర్శనము కలుగును. ఆరోగ్యము బాగుగా ఉంటుంది. మీ మంచి తనమును అందరు గుర్తిస్తారు. గృహములో సంతోషమైన, విలాసవంతమైన జీవితము గడుపుతారు. పెళ్లికాని వారికి వివాహ యోగము, వివాహితులకు సంతాన యోగము ఉన్నవి. కొత్తగా పెళ్లయిన వారికి వారి దాంపత్య జీవితము సాఫీగా సాగుతుంది. మే నుంచి గురువు అష్టమంలో సంచరించటం వలన ఈ సమయం మీకు అసంతృస్తిని తెస్తుంది. ఆరోగ్య భంగము మరియు పలు రోగాల వలన శారీరక హాని మరియు నిరుత్సాహముతో ఉంటారు. కార్య సాధనకు కష్టించి పని చేయవలసి వస్తుంది. అనవసరమైన వాదనలకు దిగక, చేయు పనియందు దృష్టి పెట్టాలి. ఉద్యోగ విషయాలలో జాగ్రత్త అవసరము, లేనిచో భంగపాట్లు తప్పవు. ప్రభుత్వ విషయాలలో చిక్కుల్లో చిక్కుకొని, అవసరమైతే జైలు పాలు అవుతారు. అనవసరపు ఖర్చులు చేయరాదు. దొంగతనము జరగకుండా జాగ్రత్తలు అవసరము. ప్రయాణము చేయవలసి వస్తే దాన్ని వాయిదా వేయుట మంచిది. ప్రయాణములో ఇబ్బందులు మరియు అనుకున్న ఫలితములు దక్కవు. ఇంట్లో వారితోను, స్నేహితులతోను తగవులు పనికిరావు. ఇవి మిమ్మల్ని శత్రుత్వము పెంచేలా దోహదపడుతుంది. మీరు ఉగ్ర రూపులుగా తయారు అవుతారు. దురుసుగా వ్యవహరిస్తారు. దయలేకుండా ప్రవర్తిస్తారు. కావున, శాంతముగా ఉండుట మంచిది. శని సంవత్సరమంతా 2వ ఇంటిలో సంచరించటం వలన ఇది ఒక గడ్డుకాలము, అనుకున్న పనిలో ఆటంకాలు, ఆశించిన ఫలితాలు దక్కవు. మీరు ఉద్యోగములో ఉన్నట్లైతే ఆచి, తూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికముగా ఈ కాలము మంచిది కాదు. ఖర్చులు తగ్గించుకోవాలి. ఈ దశలో అనవసర వాగ్వివాదములకు దిగి, కొత్త శత్రువులను సంపాదిస్తారు. మీలో కొందరి మనస్తత్వము చెడు వైపు మళ్లుతుంది. మీ గృహములో అనవసరముగా జీవిత భాగస్వామిని బాధించరాదు. సంతానమును చక్కగా చూసుకొనవలెను. ఈ దశలో ఆరోగ్యముపై శ్రద్ధ చూపగలరు. నీరసము, నిరుత్సాహము కలుగును. చిన్న పని చేసినను తొందరగా అలసి పోవుదురు. కొందరు వేరే దేశములు వెళ్ల వలసి వచ్చును. రాహువు సంవత్సరమంతా 5వ ఇంటిలో సంచరించటం వలన ఈ సమయంలో సంతానము వలన ఇబ్బందులు, ఆర్థికముగా మంచిది కాదు. మితముగా ఖర్చు చేయుట మంచిది. తల్లిదండ్రుల మరియు జీవిత భాగస్వామి ఆరోగ్యమునకు భంగము, పుత్ర దోషము వలన సంతాన విషయాలు మిమ్ములన, పిల్లలను బాధించును. పిల్లల ఆరోగ్య విషయములో జాగ్రత్త వహించాలి. పిల్లల ఆరోగ్య భంగము, వారికి అనుకోని రోగములు వచ్చి చాలా ఇబ్బందులకు గురి కావచ్చును. మనశ్శాంతి నశించును. తొందరపాటు తనము వలన తప్పుడు నిర్ణయాలు తీసుకొందురు. కాని, కొందరికి అనుకోని విధముగా వృత్తి వ్యవహారములలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ధన లాభము కలుగవచ్చును. కేతువు సంవత్సరమంతా 11వ ఇంటిలో సంచరించటం వలన ఈ దశ మీ ధ గృహమునందు, మీకు పెళ్లికాని పిల్లలు ఉన్నట్లైతే వారికి మంచి సంబంధాలు కలిగి పెళ్లి నిశ్చయమగును. ఈ కాలములో మీ చిన్న కుమార్తె/కుమారుని ఆరోగ్య విషయములో జాగ్రత్తగా ఉండవలెను. మీలో కొంతమందికి పుణ్యకార్యములు చేయుటకు గురువు లభిస్తారు. దీని వలన మీరు ఎంతో ధైర్యముతో పుణ్య మార్గములో/భక్తి మార్గములో నడుచుకొందురు. ఈ దశ మీకు మంచిని, తెస్తుంది. అలాగే ఇష్టమైన పదార్థములు బలుజింతుదురు. అయితే కేతు ప్రభావము వలన మీలో నిరుత్సాహము పెరిగి, మీ మనస్సుకు చింత కలుగును. ఈ దశలో మీకు వ్యవసాయము పట్ల మక్కువ పెరుగును. |
|

