మిథున రాశి:
మృగశిర (3, 4 పాదాలు),
ఆరుద్ర (
4),
పునర్వసు (
1, 2, 3 పాదాలు)

ఆదాయం: 5

వ్యయం: 5

రాజపూజ్యం: 3

అవమానం: 6

గురువు మే 2 వరకు 9 వ స్థానంలో మే 2 నుంచి, నవంబర్ 1 వరకు 10వ స్థానంలో, తిరిగి నవంబర్ 1 నుంచి డిశంబర్ 6 వరకు 9వ స్థానంలో తిరిగి డిశంబర్ 6నుంచి వత్సరాంతం వరకు 10వ స్థానంలో సంచరిస్తాడు.

శని ఈ సంవత్సరమంతా 4వ ఇంటిలో, రాహువు 7వ ఇంటిలో, కేతువు 1వ ఇంటిలో సంచరిస్తారు.

గురువు మే వరకు నవమ స్థానంలో సంచరించటం వలన  ఈ సమయము మీకు ఆర్థికముగా మంచిది. చేస్తున్న పని యందు లాభము. ఉన్నత పదవి, కార్యసిద్ధి మరియు పై అధికారుల మన్ననలు, రచయితలకు పుస్తకాలు అచ్చువేయించే వారికి, గురువులకు మరియు పత్రికా రంగములో ఉన్న వారికి మంచి కాలము. సంఘములో గౌరవ మర్యాదలు పొంది, మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. దైవ కార్యములపై శ్రద్ధ పెరిగి, చాలా దైవ కార్యములు, పూజలు చేస్తారు. గురువుల ఆశీర్వాదము పొంది, శుభ కార్యములు చేస్తారు. అన్ని చోట్ల నుండి ధనము లభించును. చేతిలో సొమ్ము ఎల్లప్పుడు ఉంటుంది. పంట పొలాలు, వాహ పెళ్లికాని వారికి, వారు తలచిన  వ్యక్తి లభిస్తుంది. వివాహితులకు సంతాన యోగ్యము, రుచికరమైన భోజ ఆరోగ్యము, దూర ప్రయాణాలు చేయుటకు ప్రయత్నాలు మొదలైన ఫలితాలుంటాయి.

గురువు మే నుంచి 10వ ఇంటిలో సంచరించటం వలన   సమయం మీ జీవితములో కుట్రల్ని తెస్తుంది. మీరు చెడ్డ తనముతో ఆలోచిస్తారు. కొన్ని పనులు పూర్తి కానందున మీకు అసహనముగా ప్రవర్తిస్తారు. శాంతిగా ఉండుటకు ప్రయత్నించాలి, లేదా అసంతృప్తి మిమ్మల్ని వేధిస్తుంది.. ఇంట్లో పెద్ద వారితో, ఉద్యోగములో పై అధికారులతోను వాదనలకు దిగకుండా ఉండుటకు ప్రయత్నించాలి. జాగ్రత్తగా లేనిచో మీ పదవి పోగొట్టుకొని, గౌరవాన్ని కూడా పోగొట్టుకొని, ఇష్టము లేని దూర ప్రాంతాలకు బదలీ అవుతారు. ధనమును, ఆస్తులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. శారీరక శ్రద్ధ అవసరము, పిల్లల ఆరోగ్యభంగము, కండ్ల జబ్బులు, మరియు గొంతు సంబంధ అనారోగ్యాలకు గురి అయ్యే అవకాశముంటుంది.

శని సంవత్సరమంతా 4వ స్థానంలో సంచరించటం వలన  ఈ సమయంలో జాగ్రత్త అవసరము. ఆర్థిక పరముగా మంచిది కాదు. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. వృత్తి వ్యవహారములందు ఆసక్తి, ఉత్సాహము తగ్గును. వృత్తిని ఇష్టపడక పోవుటచే పైఅధికారుల వలన మాటలు పడుదురు. కొంతమందికి ఉద్యోగములో వేరే చోటికి బదిలీలు జరుగును. సంఘములో మంచిగా ప్రవర్తించుటకు ప్రయత్నించగలరు, చేసే ప్రతి పనియందు నిదానము అవసరము. శారీరక శ్రద్ధ అవసరము. ఉదరకోశ సంబంధ వ్యాదలులు కలుగును. ప్రాణభీతి, భయము, మ శత్రువులతో విరోధము తగదు. స్నేహితులు, అయిన వారు దూరమగుటకు అవకాశము ఉండవచ్చును. గృహములోను భార్యా, పిల్లల ఆరోగ్య భంగములు, గృహములో అయిన వారికి మరణము సంభవించవచ్చును. అయిన వారితో విభేధాలు పనికి రావు. బంధువర్గములో మరియు గృహములో శత్రుత్వము పెరుగును. శత్రువులకు దూరముగా ఉండుట మంచిది. కొందరికి సంతాన అవకాశము కూడా ఈ దశలో కలుగవచ్చును.

రాహువు సంవత్సరమంతా సప్తమ స్థానంలో సంచరించటం వలన సమయం మీకు మంచిది కాదు. స్థిరాస్థుల కొనుగోలు విషయములో దూరముగా ఉండాలి. లేదా నష్టము వాటిల్లే అవకాశము ఉండవచ్చును. కాని, అనుకోని రీతిలో వృత్తి వ్యాపారములందు ధన నష్టం కలిగే అవకాశమున్నది. గృహమునందు విరోధాలు, విభేదాలకు దూరముగా ఉండుట మంచిది. స్నేహితులతోను, బంధువర్గమువారితోను, స్నేహితులతోను కలసి మెలసి మెలుగుటకు ప్రయత్నించగలరు. పరస్త్రీతో కలయుట మంచిది కాదు, దాని వలన మీకు అపకీర్తి సంభవించవచ్చును. అంటు రోగములు వచ్చుటకు సంభవమున్నది. ఆరోగ్యముపై శ్రద్ధ చూపగలరు. జీవితభాగస్వామి ఆరోగ్యము కూడా మందగించును. మంచి ప్రవర్తనతో నడచుకొనవలెను. శత్రువులో వైరము వలదు. అనవసరమైన చిక్కుల్లో పడతారు. చెడ్డ పేరు తెచ్చే పదవి చేయరాదు.. కొందరికి స్థాన చలనము మరియు ఇబ్బందులు కలుగవచ్చును.

కేతువు సంవత్సరమంతా జన్మస్థానంలో సంచరించటం వలన  ఈ సమయం మీకు ఒక పరీక్షా సమయములా ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండవలెను. ఆర్థికముగా కూడా అంత మంచిది కాని కాలము. ఖర్చులు పెరిగి, సొమ్ము మీ చేతిలో నిలువదు. ఎవరి వద్ద ఋణములు చేయరాదు. అనుకున్న ఫలితములు కలుగవు. అపకీర్తి తెచ్చే ఏపని చేయవలదు. ఆరోగ్య భంగము, సొంత హాని/ప్రమాదము తెచ్చే ఏపని చేయవలదు. ప్రశాంతముగా ఉండుటకు ప్రయత్నించవలెన, లేనిచో శారీరక అలసట మిమ్మల్ని వేధిస్తుంది. శిరోవేధన కలుగవచ్చును. గృహములో అనవసరముగా ఎవరితోను వాదోపవాదములు పనికి రావు. గృహములో బంధువర్గము వారితో విరోధములు కలుగవచ్చును.