![]() |
|
|
|
|
|
ఆదాయం: 8 |
వ్యయం: 14 |
|
రాజపూజ్యం: 4 |
అవమానం: 3 |
|
గురువు మే 2 వరకు 11 వ స్థానంలో మే 2 నుంచి, నవంబర్ 1 వరకు 12వ స్థానంలో, తిరిగి నవంబర్ 1 నుంచి డిశంబర్ 6 వరకు 11వ స్థానంలో తిరిగి డిశంబర్ 6నుంచి వత్సరాంతం వరకు 12వ స్థానంలో సంచరిస్తాడు. శని ఈ సంవత్సరమంతా 6వ ఇంటిలో, రాహువు 9వ ఇంటిలో, కేతువు 3వ ఇంటిలో సంచరిస్తారు. మే వరకు గురువు 11వ స్థానంలో సంచరిస్తాడు. ఈ సమయములో ఉద్యోగములో ఉన్నత పదవి, వ్యాపారములో లాభము, ఉన్నత స్థాయి లభిస్తాయి. సంఘములో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి సమయము, శారీరకముగా, మానసికముగా చక్కగా ఉండి, అందరు మిమ్మల్ని గుర్తించే విధముగా ప్రవర్తిస్తారు. స్నేహితుల నుండి, అయిన వారి నుండి లాభము, శత్రు దైవ కార్యముల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఎల్లప్పుడు దైవ చింతన చేయుట వలన శక్తి లభిస్తుంది. పెళ్లికాని వారికి వివాహము, వివాహితులకు సంతాన యోగ్యము, కొందరికి అన్యస్త్రీతో శృంగారము సంభవించును. ఆర్థికముగా బాగుండి, స్థలము, ఆభరణాలు, వాహనముల లాభము మొ. ఫలితాలుంటాయి. మే నుంచి నవంబర్ వరకు 12 వ స్థానంలో సంచరించటం కారణంగా ధన వ్యయము ఎక్కువగా చేస్తారు. వ్యాపారాలు చేయుట కష్టతరము, ముఖ్యముగా పశువులు పాలించే వారి వ్యాపారములో కుట్రలు ఎక్కువ. అయితే కొందరు పుణ్య కార్యములు, శుభకార్యములకు ధనము ఖర్చు చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఈ సమయములో స్వగ్రామమునకు, సంతా ఉద్యోగములో ఉన్న వారు పని యందు జాగ్రత్తగా ఉండుట అవసరము, లేదా ఉద్యోమునకు నష్టము వాటిల్లే ప్రమాదము ఉంది. ఈ సమయములో మీరు వింతగా ప్రవర్తిస్తారు. మానసికముగా, శారీరకముగా అ అయిన వారితోను, అందరితోను మీరు చెడ్డగా వ్యవహరిస్తారు. మీలో కొంత సమయానికి మంచితనము నశిస్తుంది. సంఘములోని వారు మీకు ఎదురు తిరుగుతారు. అపకీర్తి సంభవిస్తుంది. చెడు పనులకు దూరముగా ఉండగలరు. కొందరికి ధన లాభము, తద్వారా వాహన కొనుగోలు సంభవించవచ్చును. శని ఆరవ స్థానములో సంచారం కారణంగా ఈ సంవత్సరంలో ఆర్థిక లాభమునకు దారితీయును. పాత బాకీలు తీర్చెదరు. ధనము అన్ని చోట్లయందు లభించును. మీరు స్థలమును గాని, ఇళ్లుగాని కొనగలరు. శత్రు జయము, ఆరోగ్యదాయకముగా ఉండవచ్చును. ఇంటా, బయటా బాగుండును. పై అధికారుల మనన్నలు పొందుదురు. స్నేహితులు మేలు చేయగలరు. వైవాహిక జీవితము మెరుగుపడును. సంతానము కలుగును. ఈ కాలములో బంధు వర్గము వారు మీతో సంతోషముగా ఉందురు. రాహువు 9వ ఇంటిలో సంచరించటం వలన ధన నష్టము, చెడ్డపనులు చేయుదురు. కష్టించి గడించిన సొమ్మును లాటరీలకు వినియోగించి, తద్వారా నష్టపోవుదురు. ధన వ్యయము జాగ్రత్తపడనిచో కష్టకాలము చవి చూచెదరు. జాతి విరుదœమైన పనులు చేయుదురు, చేతబడులు చేసే అవకాశము ఉండవచ్చును. వృత్తి వ్యవహారములలో ఒడిదుడుకులు మరియు ఇబ్బందులు ఎదుర్కొనవచ్చును. సోదర వర్గముతో వాదోపవాదములు పనికిరావు. స్నేహితులతోను, తెలిసిన/అయిన వారితో చక్కగా మెలగవలెను, లేనిచో వారు మిమ్మల్ని దూరముగా ఉంచుదురు. గ్రహ భముచే తల్లిదండ్రులతోను, సోదర వర్గముతోను విరోధము, ఈ సమయములో చెడ్డ స్నేహములు పనికి రావు. ఆరోగ్యముపై శ్రద్ధ అవసరము. కేతువు 3వ ఇంట సంచరించటం వలన ఈ సంవత్సరం మీకు ఆనందమును, ధనలాభమును కలిగించును. ఇంతవరకు అవ్వని పనులు పూర్తవుతాయి. కార్యసిద్ధి, అనుకున్న పనులు మంచిపేరు తెచ్చే కాలము. విద్యార్థులకు మంచి కాలము. మీలో కొంతమంది గణిత శాస్త్రమును చక్కగా అభ్యసించగలరు. ప్రయాణములు సంభవించే అవకాశము ఉండవచ్చును. |
|

