మీన రాశి:
పూర్వాభాద్ర (4వ పాదం),
ఉత్తరాభాద్ర (
4),
రేవతి (
4)

ఆదాయం: 11

వ్యయం: 5

రాజపూజ్యం: 2

అవమానం: 4

గురువు మే 2 వరకు 12 వ స్థానంలో మే 2 నుంచి, నవంబర్ 1 వరకు 1వ స్థానంలో, తిరిగి నవంబర్ 1 నుంచి డిశంబర్ 6 వరకు 12వ స్థానంలో తిరిగి డిశంబర్ 6నుంచి వత్సరాంతం వరకు 1వ స్థానంలో సంచరిస్తాడు.

శని ఈ సంవత్సరమంతా 7వ ఇంటిలో, రాహువు 10వ ఇంటిలో, కేతువు 4వ ఇంటిలో సంచరిస్తారు.

గురువు మే వరకు 12వ ఇంటిలో సంచరించటం కారణంగా  ఈ దశలో ఖర్చులు అధికంగా చేయుదురు. ధన వ్యయము ఎక్కువగా చేస్తారు. వ్యాపారాలు చేయుట కష్టతరము, ముఖ్యముగా పశువులు పాలించే వారి వ్యాపారములో కుట్రలు ఎక్కువ. అయితే కొందరు పుణ్య కార్యములు, శుభకార్యములకు ధనము ఖర్చు చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఈ సమయములో స్వగ్రామమునకు, సంతా ఉద్యోగములో ఉన్న వారు పని యందు జాగ్రత్తగా ఉండుట అవసరము, లేదా ఉద్యోమునకు  నష్టము వాటిల్లే ప్రమాదము ఉంది. ఈ సమయములో మీరు వింతగా ప్రవర్తిస్తారు. మానసికముగా, శారీరకముగా అ అయిన వారితోను, అందరితోను మీరు చెడ్డగా వ్యవహరిస్తారు. మీలో కొంత సమయానికి మంచితనము నశిస్తుంది. సంఘములోని వారు మీకు ఎదురు తిరుగుతారు. అపకీర్తి సంభవిస్తుంది. చెడు పనులకు దూరముగా ఉండగలరు. కొందరికి ధన లాభము, తద్వారా వాహన కొనుగోలు సంభవించవచ్చును.

గురువు మే నుంచి జన్మస్థానంలో సంచరించటం వలన  అనవసరపు ఖర్చుల వలన ధన నష్టము సంభవిస్తుంది.  దూర ప్రయాణాలను రద్దు చేసుకొనుట మంచిది, లేనిచో ఆశించిన ఫలితములు దక్కవు. పైగా ఇబ్బందులకు గురి కాగలరు. స్వగ్రామమునకు దూరముగా నివసించవలసి ఉంటుంది. నిరుద్యోగులకు నిరుత్సాహమే మిగులుతుంది. వృత్తి వ్యవహారములలో ఉన్న వారికి కూడా కష్టకాలము, పై అధికారులతో వాదోపవాదములకు దిగవద్దు. దీని వలన మానసిక శాంతి ఉండదు. కావున, తలపెట్టిన పనుల యందు మరింత శ్రద్ధ వహించి చేస్తున్న ఉద్యోగము పోవుటకు అవకాశము ఉన్నది. ప్రభుత్వము నుండి ఒత్తిడి, కావున చేయు పనులందు జాగ్రత్త అవసరము. గృహమునందు కూడా ఎవరితోను వాదోపవాదములకు దిగకుండ, శాంతిగా ఉండుటకు ప్రయత్నించాలి. ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి. నిర్ణయములు తీసుకున్నపుడు జాగ్రత్తగా ఆలోచించాలి. మరి కొందరు పాత సమస్యల నుండి ముక్తులు అవుతారు. సంతానము అభివృద్ధి, దైవ కార్యములపై శ్రద్ధ పెరుగుతుంది.  విద్యార్థులకు మంచి కాలము, సంఘములో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

శని సంవత్సరమంతా 7వ ఇంటిలో సంచరించటం కారణంగా  ఈ దశలో మీ జీవితము మందకొడిగా సాగుతుంది. ప్రతీ విషయములోను జాగ్రత్త పాటించాలి. ధన నష్టము, ఋణములు చేయరాదు. పని ఒత్తిడి పెరుగును. కష్టించి పని చేయాలి. భాగస్వామ్య వ్యాపారములో మిమ్మల్ని మోసము చేయుదురు. వృత్తి వ్యవహారములందు జాగ్రత్తగా పని చేయగలరు. విద్యార్థులు చదువుపై నిగ్రహము పెట్టుట కష్టము. విదేశి ప్రయాణములు సంభవము. అయితే, కుట్రలు ఎదుర్కొందురు. స్థాన చలనము సంభవించును. మీ ఆరోగ్యముపై, మీ భార్యా పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము. స్నేహితులు, వ్యాపార భాగస్వాములతో అనవసర వివాదాలు ఏర్పడతాయి. అనవసర విషయాలలో, వివాదాలలో తలదూర్చకండి.

రాహువు ఈ సంవత్సరమంతా 10వ ఇంటిలో సంచరించటం వలన   దశ మిశ్రమ ఫలితములను ఇచ్చును. మొదటి భాగము మంచి కాలము, మిగతా తర్వాత భాగము చెడు ఫలితములను ఇచ్చును మీ వృత్తి వ్యవహారములలో   తద్వారా మరిన్ని బాధ్యతలు, హక్కులు వచ్చిన సొమ్ముపై శ్రద్ధ చూపవలెను లేనిచో నష్టము సంభవించవచ్చును. ఆరోగ్య భంగము, నిద్రలేమి వలన ఆరోగ్య బాధలు, తల్లిదండ్రుల ఆరోగ్యముపై శ్రద్ధ చూపవలెను. మీరు 'మారక దశ' లో ఉన్నట్లేౖతే ప్రమాదాలకు దూరముగా ఉండవలెను. కొందరికి తల్లిదండ్రుల మరణవార్తఇది 'కర్మదశ' వలన సంభవించును. మనశ్శాంతి లేనందు వలన నిర్ణయాలు తీసుకొ ఇంట్లో, జీవిత భాగస్వామితో గొడవ పడుదురు. మీకు ఇష్టము కాని/ నచ్చని చోటుకు బదిలీ అగుదురు. మీ భోజన అలవాట్లలో తేడా వచ్చి ఇబ్బందులు ఎదుర్కొందురు, ఇంట్లో పుణ్య కార్యము/దైవకార్యము జరిపించవలెను..

కేతువు చతుర్థ స్థానములో సంచరించటం కారణంగా  ఈ కాలములో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కార్యసిద్ధి కొరకు ఎక్కువగా శ్రమించవలసి వస్తుంది. ఆర్థిక పరముగా అంతగా కలసి వచ్చే దశకాదు. ఎక్కువ మొత్తములో ఋణములు చేయరాదు. విరోధములకు దూరముగా ఉండుట మంచిది. అలాగే స్థిరాస్థి విషయములో జాగ్రత్త అవసరము, లేదా దానిని కోల్పోదురు. ఆరోగ్యభంగము, ఆరోగ్యముపై తగినంత శ్రద్ధ చూపవలెను. వేడిగా దూరముగా ఉండగలరు. నిరుత్సాహము, అలసటగా ఉందురు. తల్లి అ చెడు స్నేహములు వలదు. లేదా వ్యసనములకు గురి కాగలరు. తద్వాదా నష్టపోదురు. ప్రయాణముల సంభవము, కాని వాటికి దూరముగా ఉండగలరు. లేనిచో ప్రమాదాలు జరుగుటకు అవకాశము ఉండవచ్చును. వాహన నష్టము కూడా జరుగవచ్చును. దగ్గర బంధువుల మరణము, తద్వారా స్మశాన దర్శనము కలిగే అవకాశము ఉండవచ్చును.