మకర రాశి:
ఉత్తరాషాఢ (2, 3, 4పాదాలు),
శ్రవణం (4),
ధనిష్ట (
1, 2 పాదాలు)

ఆదాయం: 14

వ్యయం: 14

రాజపూజ్యం: 3

అవమానం: 1

గురువు మే 2 వరకు 2 వ స్థానంలో మే 2 నుంచి, నవంబర్ 1 వరకు 3వ స్థానంలో, తిరిగి నవంబర్ 1 నుంచి డిశంబర్ 6 వరకు 2వ స్థానంలో తిరిగి డిశంబర్ 6నుంచి వత్సరాంతం వరకు 3వ స్థానంలో సంచరిస్తాడు.

శని ఈ సంవత్సరమంతా 9వ ఇంటిలో, రాహువు 12వ ఇంటిలో, కేతువు 6వ ఇంటిలో సంచరిస్తారు.

గురువు మే వరకు 2వ స్థానంలో సంచరించటం కారణంగా ఇది మంచి సమయము ఉంటుంది, అన్నింటా జయము, ధన లాభము, వృత్తి వ్యవహారములు, వ్యవసాయము కలసి వచ్చును. తద్వారా దానధర్మములు చేస్తారు. స్థలమును కొనుగోలు చేస్తారు లేదా పాత బాకీలు తీరుస్తారు. గృహమునందు సంతోషము, వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, వృత్తి వ్యవహారాలలో పైఅధికారుల అనుగ్రహము పొంది మిగతా వారికి ఆదర్శప్రాయువులు అవుతారు.  శత్రుహాని, సంఘములో ఉన్నత స్థాయి, గౌరవ మర్యాదలు ప్రాప్తించును. మనస్సున శాంతి, తద్వారా మంచి బుద్ధితో ఆలోచన కలుగుతుంది. ఆర్థికంగా మంచి అభివృద్ధి కలుగుతుంది.

గురువు మే నుంచి 2వ స్థానంలో సంచరించటం కారణంగా   సమయం అంతగా మంచిది కాదు. ఒడుదుడుకులు, ఇబ్బందులు, చేయు వృత్తుల యందు ధన నష్టము మరియు వృత్తి నష్టము. వృత్తి వ్యవహారములలో జాగ్రత్త అవసరము. పై అధికారుల నుండి ఇతర ఉద్యోగుల నుండి వ్యతిరేకము. సోదరులతోను, స్నేహితులతోను వాదోపవాదములకు దూరముగా ఉండగలరు. కొందరికి స్నేహితుడుగాని, బంధువుగాని దూరమగుదురు. మీ యొక్క, మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము మందగించి రోగములు సంభవము, శరీర శ్రమ, ఆతృత మిమ్మల్ని కుంగదీయును. ప్రయాణములను వాయిదా వేయవలెను. గృహములో శుభ కార్యములు చేయుదురు లేదా వివాహము జరుగవచ్చును.

శని సంవత్సరమంతా 9వ ఇంటిలో సంచరించటం వలన సమయం మిమ్మల్ని నిరుత్సాహ పరచేదిగా ఉంటుంది. వృత్తి వ్యవహారములలో కష్టకాలము, ఉద్యోగములో వేరే చోటికి బదిలీలు జరిగి, ఎక్కువ కష్టించవలసి వచ్చును. ఇతర ఉద్యోగులతోను, శత్రువులతోను జాగ్రత్తగా మసలు కోవలెను. మంచి పేరు తెచ్చుకొనుటకు బాగా కష్టించి కృషి చేయాలి. ధనవిషయాలలో జాగ్రత్త అవసరము. అనవసర ఖర్చులు చేయుదురు. ఎక్కువ సంపాదనకు కష్టించి పని చేయవలెను. ఇబ్బందులు ఎదుర్కొందురు. చెడ్డ పనులకు దూరముగా ఉండాలి. బుద్ధి బ్రలంశము కలుగవచ్చును. ఆరోగ్యముపై శ్రద్ధ అవసరము. మనశ్శాంతి ఉండదు. భార్య, పిల్లల ప్రవర్తన చింతను పెంచును. మీ పుత్రుని ఆరోగ్యము క్షీణించును. దగ్గర బంధువులకు మరణము సంభవించును.

రాహువు 12వ ఇంటిలో సంచరించటం వలన సమయం ఇబ్బంది కరంగా ఉంటుంది. వృత్తి వ్యవహారములలో నష్టము వాటిల్లును. ఎంతపని చేసినను అనుకున్న ఫలితాలు దక్కవు. ఇంతకు మునుపు చేపట్టిన పనులలో కూడా ఆటంకములు ఎదురు అగును. వృత్తి వ్యవహారములలో మ మితముగా ఖర్చులు చేయడము మంచిది. లేదా ఋణ బాధలకు గురి కావచ్చును. ఆఖరికి స్థిరాస్థిని వదులు కోవలసి వచ్చును. స్థాన చలనమునకు కూడా అవకాశము ఉండవచ్చును. చెడ్డ పేరు తెచ్చే పనుల్లో తల దూర్చరాదు. అయిన వారితో మంచిగా మసలుకోవలెను. వారిని నిర్లక్ష్యము చేయుట వలన వారు ఎదురు తిరిగే అవకాశము ఉండవచ్చును. మీ యొక్క, మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యభంగము, ఔషదసేవ అవసరము. ఆరోగ్యముపై ప్రత్యేక శ్రద్ధ చూపవలెను. లేనిపోని రోగాలు కొని తెచ్చుకోగలరు. నిద్రలేమితో బాధ పడవచ్చును.

కేతువు 6వ ఇంట సంచరించటం కారణంగా ఈ దశ మీకు మంచి ఫలితాలను తెచ్చును. వ్యాపారస్తులకు మంచి కాలము. వ్యాపారములు కలసివచ్చును. వ్యవసాయదార్లకు, పశువులు కాయువారికి వారి రంగములలో ఆర్థిక లాభము సంభవించే అవకాశము ఉండవచ్చును.  ఆర్థికముగా బాగుండును. వేరే వారికి ఋణములు ఇచ్చుట వలన ధన లాభము, ఆదర్శవంతులుగా అందరి వద్ద ఉండి ధనలాభము పొందుదురు. శత్రు జయము సంభవించవచ్చును. మీ ఆరోగ్యముపై శ్రద్ధ అవసరము. సరైన ఔషదసేవ చేయనిచో తీవ్రమైన అ గృహమునందు సంతోషములు లాభించును, గృహమునందు శుభకార్యములు, వివాహము లేదా విహార యాత్రలు, అందరితోను శాంతిగా వ్యవహరిస్తారు.