![]() |
|
|
|
|
|
ఆదాయం: 14 |
వ్యయం: 14 |
|
రాజపూజ్యం: 6 |
అవమానం: 1 |
|
గురువు మే 2 వరకు 1 వ స్థానంలో మే 2 నుంచి, నవంబర్ 1 వరకు 2వ స్థానంలో, తిరిగి నవంబర్ 1 నుంచి డిశంబర్ 6 వరకు 1వ స్థానంలో తిరిగి డిశంబర్ 6నుంచి వత్సరాంతం వరకు 2వ స్థానంలో సంచరిస్తాడు. శని ఈ సంవత్సరమంతా 8వ ఇంటిలో, రాహువు 11వ ఇంటిలో, కేతువు 5వ ఇంటిలో సంచరిస్తారు. గురువు మే వరకు జన్మస్థానంలో సంచరించటం వలన అనవసరపు ఖర్చుల వలన ధన నష్టము సంభవిస్తుంది. దూర ప్రయాణాలను రద్దు చేసుకొనుట మంచిది, లేనిచో ఆశించిన ఫలితములు దక్కవు. పైగా ఇబ్బందులకు గురి కాగలరు. స్వగ్రామమునకు దూరముగా నివసించవలసి ఉంటుంది. నిరుద్యోగులకు నిరుత్సాహమే మిగులుతుంది. వృత్తి వ్యవహారములలో ఉన్న వారికి కూడా కష్టకాలము, పై అధికారులతో వాదోపవాదములకు దిగవద్దు. దీని వలన మానసిక శాంతి ఉండదు. కావున, తలపెట్టిన పనుల యందు మరింత శ్రద్ధ వహించి చేస్తున్న ఉద్యోగము పోవుటకు అవకాశము ఉన్నది. ప్రభుత్వము నుండి ఒత్తిడి, కావున చేయు పనులందు జాగ్రత్త అవసరము. గృహమునందు కూడా ఎవరితోను వాదోపవాదములకు దిగకుండ, శాంతిగా ఉండుటకు ప్రయత్నించాలి. ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి. నిర్ణయములు తీసుకున్నపుడు జాగ్రత్తగా ఆలోచించాలి. మరి కొందరు పాత సమస్యల నుండి ముక్తులు అవుతారు. సంతానము అభివృద్ధి, దైవ కార్యములపై శ్రద్ధ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి కాలము, సంఘములో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గురువు మే నుంచి 2వ స్థానంలో సంచరించటం కారణంగా ఇది మంచి సమయము ఉంటుంది, అన్నింటా జయము, ధన లాభము, వృత్తి వ్యవహారములు, వ్యవసాయము కలసి వచ్చును. తద్వారా దానధర్మములు చేస్తారు. స్థలమును కొనుగోలు చేస్తారు లేదా పాత బాకీలు తీరుస్తారు. గృహమునందు సంతోషము, వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, వృత్తి వ్యవహారాలలో పైఅధికారుల అనుగ్రహము పొంది మిగతా వారికి ఆదర్శప్రాయువులు అవుతారు. శత్రుహాని, సంఘములో ఉన్నత స్థాయి, గౌరవ మర్యాదలు ప్రాప్తించును. మనస్సున శాంతి, తద్వారా మంచి బుద్ధితో ఆలోచన కలుగుతుంది. ఆర్థికంగా మంచి అభివృద్ధి కలుగుతుంది. శని సంవత్సరమంతా అష్టమంలో సంచరించటం వలన ఈ దశ మంచిది కాదు. కష్ట కాలము, వృత్తి వ్యవహారములు కలసి రావు. పని నష్టము సంభవించును. దురలవాట్లు, వ్యసనములు, చెడ్డవారితో సహవాసము, కొంతమంది జైలు పాలగుదురు. సంఘములో అపకీర్తి సంభవించవచ్చును. ప్రయాణాలు సంభవించును. మితముగా ఖర్చు పెట్టవలసి వచ్చును. ఆరోగ్యముపై శ్రద్ధ చూపవలెను. ఆరోగ్య భంగము, ఇంటి పనులలో మీపై ఒత్తిడి పెరుగును. నక్షత్ర భముచే కష్టకాలము ఎదుర్కొందురు. అయిన వారిని పోగొట్టుకొందురు. అనవసర విరోధములు తెచ్చుకొని గృహములో కొత్త శతృత్వము పెంచుకొందురు. రాహువు సంవత్సరమంతా 11వ స్థానంలో సంచరించటం వలన ఈ దశ మంచి కాలము. ఆర్థికముగా బాగుండును. అనుకోని విధముగా ధన లాభము, అన్ని చోట్ల నుండి లభించును. విదేశీ ప్రయాణముల వలన, సముద్ర వ్యాపారముల నుండి ధన లాభము, ఈ కాలములో స్థిరాస్థి మరియు ఆభరణాలు కొందురు. ఇంట్లో పరిస్థితి బాగుండును. రుచికరమైన వంటలు, ఇంట్లో చేస్తారు. భాగస్వామి ఆరోగ్యము కుదుట పడును. పెళ్లికాని పిల్లలు ఉన్నట్లైతే సంబంధాలు కుదురుతాయి. అ సంఘములో గౌరవ మర్యాదలు, పుణ్య కార్యములు చేయుట వలన అందరి సహాయము అందుతుంది. కేతువు 5వ స్థానంలో సంచరించటం కారణంగా ఈ దశ మిమ్మల్ని జీవితములో ఒడుదుడుకులను తెస్తుంది. చేతిలోనికి సొమ్ము వచ్చినట్లే వచ్చి మాయమగును. విపరీతమైన అనవసరపు ఖర్చులు చేయుట సంభవము. సంతానము వలన కూడా విపరీత ఖర్చులు, మీలో కొందరు అనుకోని విధముగా ధనలాభము, ఋణములు చేయరాదు. చంద్రుని ప్రభావముచే పిల్లల ఆరోగ్యము మిమ్మల్ని కలవరపెడుతుండది. పిల్లల ఆరోగ్యముపై అశ్రద్ధ వలదు. లేనిచో వారి ఆరోగ్యమునకు తీరని హాని, బంధువర్గములో మరణవార్త, బంధువర్గముల వారితో ఘర్షణ తగదు. అయిన వారితో స్నేహభావముతో మెలగాలి, లేదా వారు మీకు విరోదలులు అయ్యే అవకాశము ఉండగలదు. |
|

