![]() |
|
|
|
|
|
ఆదాయం: 14 |
వ్యయం: 2 |
|
రాజపూజ్యం: 6 |
అవమానం: 6 |
|
గురువు మే 2 వరకు 8 వ స్థానంలో మే 2 నుంచి, నవంబర్ 1 వరకు 9వ స్థానంలో, తిరిగి నవంబర్ 1 నుంచి డిశంబర్ 6 వరకు 8వ స్థానంలో తిరిగి డిశంబర్ 6నుంచి వత్సరాంతం వరకు 9వ స్థానంలో సంచరిస్తాడు. శని ఈ సంవత్సరమంతా 3వ ఇంటిలో, రాహువు 6వ ఇంటిలో, కేతువు 12వ ఇంటిలో సంచరిస్తారు. మే వరకు గురువు అష్టమంలో సంచరించటం వలన ఈ సమయం మీకు అసంతృస్తిని తెస్తుంది. ఆరోగ్య భంగము మరియు పలు రోగాల వలన శారీరక హాని మరియు నిరుత్సాహముతో ఉంటారు. కార్య సాధనకు కష్టించి పని చేయవలసి వస్తుంది. అనవసరమైన వాదనలకు దిగక, చేయు పనియందు దృష్టి పెట్టాలి. ఉద్యోగ విషయాలలో జాగ్రత్త అవసరము, లేనిచో భంగపాట్లు తప్పవు. ప్రభుత్వ విషయాలలో చిక్కుల్లో చిక్కుకొని, అవసరమైతే జైలు పాలు అవుతారు. అనవసరపు ఖర్చులు చేయరాదు. దొంగతనము జరగకుండా జాగ్రత్తలు అవసరము. ప్రయాణము చేయవలసి వస్తే దాన్ని వాయిదా వేయుట మంచిది. ప్రయాణములో ఇబ్బందులు మరియు అనుకున్న ఫలితములు దక్కవు. ఇంట్లో వారితోను, స్నేహితులతోను తగవులు పనికిరావు. ఇవి మిమ్మల్ని శత్రుత్వము పెంచేలా దోహదపడుతుంది. మీరు ఉగ్ర రూపులుగా తయారు అవుతారు. దురుసుగా వ్యవహరిస్తారు. దయలేకుండా ప్రవర్తిస్తారు. కావున, శాంతముగా ఉండుట మంచిది. మే నుంచి గురువు నవమ స్థానంలో సంచరించటం వలన ఈ సమయము మీకు ఆర్థికముగా మంచిది. చేస్తున్న పని యందు లాభము. ఉన్నత పదవి, కార్యసిద్ధి మరియు పై అధికారుల మన్ననలు, రచయితలకు పుస్తకాలు అచ్చువేయించే వారికి, గురువులకు మరియు పత్రికా రంగములో ఉన్న వారికి మంచి కాలము. సంఘములో గౌరవ మర్యాదలు పొంది, మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. దైవ కార్యములపై శ్రద్ధ పెరిగి, చాలా దైవ కార్యములు, పూజలు చేస్తారు. గురువుల ఆశీర్వాదము పొంది, శుభ కార్యములు చేస్తారు. అన్ని చోట్ల నుండి ధనము లభించును. చేతిలో సొమ్ము ఎల్లప్పుడు ఉంటుంది. పంట పొలాలు, వాహ పెళ్లికాని వారికి, వారు తలచిన వ్యక్తి లభిస్తుంది. వివాహితులకు సంతాన యోగ్యము, రుచికరమైన భోజ ఆరోగ్యము, దూర ప్రయాణాలు చేయుటకు ప్రయత్నాలు మొదలైన ఫలితాలుంటాయి. శని ఈ సంవత్సరంమంతా 3వ ఇంటిలో అనుకూలంగా సంచరించటం వలన ఈ దశ మీకు మంచి కాలము, ఆర్థికముగా బాగుండును. ధనము చాలా విధాలుగా లభిస్తుంది. ఏ పని తలపెట్టి వ్యవసాయదార్లకు, కోళ్ల పెంపకము వర్తకులకు అనుకూల సమయము, ధ నిరుద్యోగులకు మంచి ఉద్యోగవకాశములు కలుగును. ఉద్యోగస్తులకు పై పదవులు, జీతము పెరుగుధ, ఉన్నత స్థాయి పొందుదురు. మీ పనిని, శ్రద్ధని, చురుకుతనమును గుర్తిస్తారు. సంఘములో మంచి పేరు సంపాదించు కొనగలరు. మీలో కొంత మంది తమ కింద పనులు చేయుటకు సేవకులను నియమించెదరు. మీకు వాక్చాతుర్యమును పొందగలరు. ఆరోగ్య లాభము, ఉత్సాహముగా ఉందురు. ఆనందముగా ఉందురు. గృహములో సుఖశాంతులు, వైవాహిక జీవితము సుఖముగా ఉండును. సోదర వర్గము, సంతానము మీకు చేదోడుగా ఉందురు. శత్రుత్వము నశించి, మంచి కాలము కలసి వచ్చును. ప్రయాణములు సంభవించును. రాహువు 6వ ఇంటిలో సంవత్సరమంతా అనుకూలుడుగా ఉండటం వలన ఈ దశ మీకు ఆర్థిక లాభమును ఇస్తుంది. వృత్తి వ్యవహారములు చక్కగా సాగును. షేర్ల మార్కెట్టు నడిపే వారికి, వ్యవసాయము, కోళ్ల పెంపకదార్లకు మంచి లాభాలు వచ్చే అవకాశము ఉండవచ్చును. మీకు ఎదురు తిరిగే వారి నుండి కూడా ధన లాభము కలుగును. మీ అత్త మామలనుండి ధ అంటు రోగాలు రాకుండా జాగ్రత్త పడవలెను. సరైన సమయానికి ఔషద సేవ చేత చక్కగా ఉందురు. సంఘములో మంచి కీర్తిని గడిస్తారు. అన్యస్త్రీతో పరిచయాలు, ఇది మీకు ఆనందాన్ని కలిగించవచ్చును. శత్రు భయ నివారణ జరిగి, అన్ని విషయాలలో సానుకూలత ఏర్పడుతుంది. కేతువు 12వ ఇంటిలో సంవత్సరమంతా సంచరించటం వలన ఈ దశలో ఆరోగ్యముపై ప్రత్యేక శ్రద్ధ అవసరము, లేనిచో ఆరోగ్య ఇబ్బందులు, మొలల రోగముతో బాధపడుదురు. జీవిత భాగస్వామి అ చేస్తున్న పనిపై శ్రద్ధ అవసరము, లేనిచో పనిలో ఇబ్బందులు ఎదురుకాగలవు. ఖర్చులను తగ్గించుకోవలెను. ఋణములు చేయరాదు. చెడ్డపనులు చేయుట వలన, కోర్టులో మీకు వ్యతిరేకముగా తీర్పు వచ్చి, జైలుకు గురి కాగలరు. అయిన వారితో మంచిగా మెలిగి, వారి సహాయతను, ఓదార్పును గ్రహిస్తారు. చంద్రుని ప్ర¦భావము వలన మీలో కొందరు సుఖశాంతులు కలిగి, చక్కగా ఉందురు. |
|

కర్కాటక
రాశి: