ధనుస్సు రాశి:
మూల (4),
పూర్వాషాఢ (
4),
 ఉత్తరాషాఢ (1వ పాదం)

ఆదాయం: 11

వ్యయం: 5

రాజపూజ్యం: 7

అవమానం: 5

గురువు మే 2 వరకు 3 వ స్థానంలో మే 2 నుంచి, నవంబర్ 1 వరకు 4వ స్థానంలో, తిరిగి నవంబర్ 1 నుంచి డిశంబర్ 6 వరకు 3వ స్థానంలో తిరిగి డిశంబర్ 6నుంచి వత్సరాంతం వరకు 4వ స్థానంలో సంచరిస్తాడు.

శని ఈ సంవత్సరమంతా 10వ ఇంటిలో, రాహువు 1వ ఇంటిలో, కేతువు 7వ ఇంటిలో సంచరిస్తారు.

గురువు మే వరకు 3వ స్థానంలో సంచరించటం కారణంగా   సమయం అంతగా మంచిది కాదు. ఒడుదుడుకులు, ఇబ్బందులు, చేయు వృత్తుల యందు ధన నష్టము మరియు వృత్తి నష్టము. వృత్తి వ్యవహారములలో జాగ్రత్త అవసరము. పై అధికారుల నుండి ఇతర ఉద్యోగుల నుండి వ్యతిరేకము. సోదరులతోను, స్నేహితులతోను వాదోపవాదములకు దూరముగా ఉండగలరు. కొందరికి స్నేహితుడుగాని, బంధువుగాని దూరమగుదురు. మీ యొక్క, మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము మందగించి రోగములు సంభవము, శరీర శ్రమ, ఆతృత మిమ్మల్ని కుంగదీయును. ప్రయాణములను వాయిదా వేయవలెను. గృహములో శుభ కార్యములు చేయుదురు లేదా వివాహము జరుగవచ్చును.

మే నుంచి గురువు 4వ స్థానంలో సంచరించటం కారణంగా  ఈ సమయం మీకు ఆందోళనను కలిగిస్తుంది. వృత్తిలో కష్టించి పనిచేయవలసి వస్తుంది. ప్రమోషన్లు అనుకున్న సమయములో రావు. అనవసరపు విషయాలలో/స్థిరాస్థి కొనుగోలు విషయాలలో తల దూర్చరాదు.  శత్రువులకు దూరముగా ఉండవలెను. అయిన వారితోను, స్నేహితులతోను మంచిగా మసలుకొనవలెను. బాధలో ఉన్న వారిని పరామర్శిస్తారు. ఆర్థికముగా కలసి రాని కాలము. అనవసరపు ఖర్చులు, ప్రయాణాలు చేయరాదు. మీ ఆరోగ్యము, తల్లి ఆరోగ్యము పై శ్రద్ధ చూపగలరు. ఈ సమయాలలో నిరుత్సాహముగాను, నీరసముగాను ఉందురు. ఈ సమయములలో జంతువులకు, ప్రయాణములకు దూరముగా ఉండవలెను. లేనిచో ప్రమాదములకు గురి కావలసి వస్తుంది. సంఘములో అందరితోను ఉన్నతంగా ప్రవర్తించాలి. లేనిచో మీకు అందరి వలన ఎదురు తనము లభిస్తుంది. అందరి వలన మాటలు పడతారు, మనస్తాపము పొందుతారు.

శని సంవత్సరమంతా 10వ ఇంటిలో సంచరించటం కారణంగా  ఆరోగ్య నష్టము, మనశ్శాంతి ఉండదు. ఇంటా, బయటా చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చును. వర్తకులు ధన నష్టము చవిచూసెదరు. వ్యవసాయదార్లు ప్రత్యేక శద్రœ వహించాలి. కొందరికి కొత్త వృత్తి లభించును. కాని ఇబ్బందులు పడుదురు. పై అధికారులలో భేదాభిప్రాయాలు సంభవించును. శత్రువులు, దొంగ దెబ్బ తీయుటకు అవకాశము ఉండవచ్చును. ఆదాయమును మించిన ఖర్చు చేస్తారు. దీని వలన పేదరికమునకు గురి కాగలరు. ఋణాలు తీసుకొనుట మంచిది కాదు. ఆరోగ్యముపై శ్రద్ధ తప్పని సరి. మోకాళ్ల  సంబంధ, ఎముకల సంబంధ సమస్యలు బాధించును. కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే అవకాశం. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడతాయి.

రాహువు సంవత్సరమంతా జన్మస్థానంలో సంచరించటం వలన ఈ దశలో విపరీతమైన చెడు మార్పులు వచ్చును. ధన నష్టము, దుబారా/అనవసరపు ఖర్చులు కలుగవచ్చును. శత్రువులతో జాగ్రత్తగా మెలగవలెను. అనుకోని ఇబ్బందులు వృత్తి వ్యవహారములలో సంభవించును. చెడు సహవాసములకు దూరముగా ఉండవలెను. శరీరముపై శ్రద్ధ అవసరము. అనుకోని రోగములు పీడించును. తల్లిదండ్రుల ఆరోగ్యమునకు భంగము కలుగవచ్చును. శారీరక శ్రమ వలన శిరోవేదన, మనశ్శాంతి లేకుండా పొతుంది. గాబరా ఎక్కువ అగును. శ్రమ పెరుగవచ్చును.

కేతువు 7వ ఇంటిలో సంచరించటం వలన ఈ దశ మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయును. ఉదర సంబంధ వ్యాదలులతో బాధపడతారు. నిరుత్సాహము, చిరాకు కలుగవచ్చును.  మనశ్శాంతి లేక చింతకు గురి కాగలరు. అనవసరపు ఖర్చులు మంచిది కాదు. ఋణములు ఎట్టి పరిస్థితులలోను చేయరాదు. వ్యవసాయదార్లు వారి పంటను జాగ్రత్తగా కాపాడుకోవాలి, లేనిచో దొంగతనము జరుగుటకు అవకాశము ఉండవచ్చును. మీలో కొందరికి అనుకోని విధముగా వృత్తి వ్యవహారములలో అభివృద్ధి కలిగి, ఆర్థిక లాభము పొందుదురు. గృహమునందు మర్యాద పాటించి, భాగస్వామితో వాదనలకు దిగకుండా ఉండుటకు ప్రయత్నించాలి. భాగస్వామితో విరోధము, మిమ్మల్ని దూరము చేయుటకు తోడ్పడును. బంధు వర్గముల వారితో మంచి ప్రవర్తనతో నడుచుకోవాలి. లేనిచో వారు విరోదలులుగా మారుటకు అవకాశము ఉండవచ్చును. గృహమునందు మర్యాద పాటించి, భాగస్వామితో వాదనలకు దిగకుండా ఉండుటకు ప్రయత్నించాలి. భాగస్వామితో విరోధము, మిమ్మల్ని దూరము చేయుటకు తోడ్పడును. బంధు వర్గముల వారితో మంచి ప్రవర్తనతో నడుచుకోవాలి. లేనిచో వారు విరోదలులుగా మారుటకు అవకాశము ఉండవచ్చును.